జూన్‌ 12వ తారీఖున పెరియ తిరుమలనంబి తిరునక్షత్రోత్సవము

జూన్‌ 12వ తారీఖున పెరియ తిరుమలనంబి తిరునక్షత్రోత్సవము

తిరుపతి, జూన్‌ 10, 2011: తిరుమల తిరుపతి దేవస్థానములో ఆళ్వార్‌ ప్రభంధం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూన్‌ 12వ తారీఖున పెరియ తిరుమలనంబి తిరునక్షత్రోత్సవము స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా నిర్వహిస్తారు.
 
జూన్‌ 12వ తారీఖున సాయంత్రం 6-8 గంటల మధ్య జరిగే ఈ ఉత్సవములో పెరియ తిరుమలనంబి జీవితం, శ్రీరామానుజాచార్యులు – పెరియ తిరుమలనంబిలపై ఉపన్యాసాలు ఉంటాయి. అదేవిధంగా జూన్‌ 12వ తారీఖున నెల్లూరు నందు, ఖమ్మం జిల్లా రేజర్ల నందు, 13వ తారీఖున తమిళనాడులోని తిరువాహీంద్రపురం, 14వ తారీఖున రామతీర్థము నందు 16వ తారీఖున శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మము నందు వివిధ ఆళ్వారుల తిరునక్షత్ర ఉత్సవాలు వేడుకగా నిర్వహిస్తారు.
 
కంటి జబ్బులతో బాధపడే వారికి ఉపశమనం కలిగించడానికి, కంటి జబ్బుల నివారణ సంబంధించి తితిదే తన కేంద్రీయ వైద్యశాల నందు శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన విషయ విధితమే.
 
ఈ ఆసుప్పత్రికి రోజు రోజుకి చికిత్స నిమిత్తమై రోగుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ రోగులందరికి మెరుగైన చికిత్సను అందించే నిమిత్తమై అవసరమైన విరాళాలను భక్తుల నుండి స్వీకరించాలని తితిదే నిర్ణయించింది. ఈ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టుకు విరాళాలు ఇచ్చు దాతలకు ఇన్‌కమ్‌టాక్స్‌ 80జి ప్రకారము పన్ను మినహాయింపు కలదు.

విరాళాలు ఇవ్వవలసిన వారు ముఖ్య వైద్యాధికారి (పరిపాలనాధికారి) శ్రీ శ్రీనివాస ట్రస్టు, తితిదే, తిరుపతికి చేరే విధంగా తమ విరాళాలను పంపవలసినదిగా కోరడమైనది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.