EASY REGISTRATION OF ROOMS FOR DEVOTEES FROM JUNE 12 _ జూన్ 12వ తేదీ నుండి భక్తులకు మరింత సులభంగా వసతి గదుల కేటాయింపు
Tirumala, 10 June 2021: TTD is coming up with new registration counters at six locations (instead of the existing registration counter only at CRO alone) in Tirumala from June 12 onwards for easy allocation of accommodations to devotees.
From Saturday onwards the room allocation counters will become operational at six locations in Tirumala including one at GNC tollgate near luggage Centre, two counters each at Balaji bus station, at Kausthubham rest house, Ram Bhagicha rest house, MBC besides the CRO.
All arrangements are completed at all six locations for registration of names for rooms and wait for SMS confirmation and thereafter to proceed towards Sub enquiry offices for payment of tariff and collection of room keys.
TTD has appealed to devotees to note the new facilities developed for their convenience and comforts.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 12వ తేదీ నుండి భక్తులకు మరింత సులభంగా వసతి గదుల కేటాయింపు
తిరుమల, 2021 జూన్ 10: భక్తుల సౌకర్యార్థం జూన్ 12వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా టిటిడి ఏర్పాటు చేసిన కౌంటర్లలో వసతి గదుల కొరకు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంది. ఇప్పటి వరకు తిరుమలలోని వసతి కొరకు సిఆర్‌వో వద్ద పేర్లు రిజిస్ట్రేషన్ మరియు గదులు కేటాయిస్తున్న విషయం విదితమే.
శనివారం నుండి జిఎన్‌సి టోల్‌గేట్ వద్ద ఉన్న లగేజి కౌంటర్ నందు రెండు కౌంటర్లు, బాలాజి మెయిన్ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, కౌస్తుభం అతిథి భవనం వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంటర్లు, రాంభగిచ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, ఎమ్‌బిసి ప్రాంతంలోని శ్రీవారి మెట్టు వద్ద రెండు కౌంటర్లు, సిఆర్‌వో వద్ద రెండు కౌంటర్లలో భక్తులు వసతి కోరకు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు ఎస్ ఎమ్ ఎస్ ద్వారా వారికి కేటాయించిన గదుల సమాచారం తెలియజేయబడుతుంది. అనంతరం వారికి గదులు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచారణ కార్యాలయాల వద్ద రుసుం చెల్లించి గదులు పొందవచ్చు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.