PUSHPAYAGAM IN SRI GT ON JUNE 18 _ జూన్ 18న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం
Tirupati, 16 Jun. 21: The annual Pushpayagam in Sri Govinda Raja Swamy temple will be observed in Ekantam in view of Covid restrictions on June 18.
Ankurarpanam for the fete will be performed on June 17.
On Friday the flower festival will be performed between 2pm and 4pm with tonnes of varieties of flowers.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూన్ 18న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం
తిరుపతి, 2021 జూన్ 16: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 18వ తేదీ శుక్రవారం పుష్పయాగం జరుగనుంది. కోవిడ్ – 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జూన్ 17న సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు మృత్సంగ్రాహణం, పుణ్యాహవచనం, సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారు.
జూన్ 18న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు.
ఆలయంలో మే 18 నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.