SUNDARAKANDA AKHANDA PARAYANAM ON JUNE 2 _ జూన్ 2న ధ‌ర్మ‌గిరిలో సంపూర్ణ‌ సుంద‌ర‌కాండ అఖండ‌పారాయ‌ణం

Tirumala, 27 May 2024: Sri Sundarakanda Akhanda Parayanam will be observed at Dharmagiri Veda Vijnana Peetham in Tirumala on June 2.
 
This spiritual event will commence at 6am and will last for about 18 hours uninterruptedly with the participation of Vedic scholars and devotees.
 
SVBC will live telecast this program where in 2872 Shlokas from Sundarakanda will be recited in connection with Hanuman Jayanti festivities.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూన్ 2న ధ‌ర్మ‌గిరిలో సంపూర్ణ‌ సుంద‌ర‌కాండ అఖండ‌పారాయ‌ణం

తిరుమ‌ల‌, 2024 మే 27: హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో భాగంగా జూన్ 2వ తేదీ తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద‌పాఠ‌శాల‌లో సంపూర్ణ సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణం జ‌రుగనుంది.

ఉద‌యం 6 గంటల నుండి అర్ధ‌రాత్రి వ‌ర‌కు దాదాపు 18 గంట‌ల పాటు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. హ‌నుమంతుడు సీతాన్వేష‌ణ కోసం లంక‌కు వెళ్లి సీత‌మ్మ జాడ తెలుసుకుని శ్రీ‌రామ‌చంద్రునికి తెలియేజేసే పూర్తి ఘట్టంలోని 2,872 శ్లోకాల‌ను పండితులు పారాయ‌ణం చేస్తారు.

హ‌నుమంతుడు విశ్రాంతి లేకుండా రామ‌కార్యం కోసం వెళ్లిన విధంగా పండితులు నిరంత‌రాయంగా సంపూర్ణ సుంద‌ర‌కాండ‌ను పారాయ‌ణం చేస్తారు. ఈ మొత్తం కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.