జూన్ 24వ తేది అలిపిరి వ‌ద్ద శ్రీపురందరదాస విగ్రహ ప్రతిష్ఠాపన

జూన్ 24వ తేది అలిపిరి వ‌ద్ద శ్రీపురందరదాస విగ్రహ ప్రతిష్ఠాపన

తిరుపతి, 2010 జూన్ 9: తిరుమల తిరుపతి దేవస్థానములు దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేది ఉదయం 7.57గంటలకు అలిపిరిలో శ్రీపురందరదాస విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగుతుంది.

ప్రముఖ సాహితీవేత్త, కవి అయిన పురందరదాస విగ్రహప్రతిష్ఠను పురస్కరించుకొని దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో స్థానిక మహతి ఆడిటోరింయం నందు రెండు రోజుల పాటు సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.