ARAYAKANDA PARAYANA DEEKSHA FROM JUNE 25-JULY 10 _ జూన్ 25 నుండి జులై 10వ తేదీ వ‌ర‌కు అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష‌ – టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 21 June 2022: TTD has been organising several Parayanams from the past two years and is now all set to observe Shodasadinatmaka Aranyakanda Parayana Deeksha from June 25 to July 10, with Ankurarpanam on June 24 said TTD EO Sri AV Dharma Reddy.

Speaking to media persons at Annamaiah Bhavan in Tirumala on Tuesday evening he said, the Aranyakanda has 2454 Shlokas penned by Sage Valmiki in Ramayana epic. It is also referred to as Mokshakanda as chanting or even listening to these shlokas will provide salvation.

He said the Shodasadinatmaka Aranyakanda Parayana Deeksha will be observed at Tirumala for 16 days seeking the divine blessings for the well-being of humanity. On the last day on July 10, Maha Purnahuti will be performed at Dharmagiri between 11 am and 12 noon.

The Principal of Dharmagiri Veda Vignana Peetham, Sri KSS Avadhani said, a total of 32 ritwiks will participate in this fete. Among them 16 will render shlokas in Vasantha Mandapam while another 16 will perform Tapa, Homa for each Shloka at Dharmagiri.

He said legends says that performance of such Vedic rites will bring health, wealth and salvation. Everyday the program will be telecasted live on SVBC for the sake of global devotees from 8:30am onwards, he maintained.

Earlier a review meeting on the arrangements for the same was held with different heads of the departments in Tirumala.

Chief Priests Sri Venugopala Deekshitulu, Sri Krishna Seshachala Deekshitulu, Sri Govindaraja Deekshitulu, CEO SVBC Sri Suresh Kumar and others HoDs were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూన్ 25 నుండి జులై 10వ తేదీ వ‌ర‌కు అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష‌ – టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2022 జూన్ 21: ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ జూన్ 25 నుండి జులై 10వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌ వ‌సంత మండ‌పంలో రామాయ‌ణంలోని అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష చేప‌ట్ట‌నున్నామ‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం సాయంత్రం ఈ కార్య‌క్ర‌మం ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

అనంత‌రం ఈవో మీడియాతో మాట్లాడుతూ మాన‌వాళిని క‌రోనా ప‌ట్టిపీడిస్తున్న త‌రుణంలో షోడ‌శ‌దిన సుంద‌ర‌కాండ దీక్ష రెండు సార్లు, అఖండ సుంద‌ర‌కాండ పారాయ‌ణం, బాల‌కాండ‌, అయోధ్య‌కాండ‌, యుద్ధ‌కాండ పారాయ‌ణం చేప‌ట్టామ‌న్నారు. కోట్లాది మంది భ‌క్తులు మంత్ర ఉచ్ఛార‌ణ చేయ‌డం వ‌ల్ల శ్రీ‌వారి ఆశీస్సుల‌తో క‌రోనా దూర‌మైంద‌ని తెలిపారు. అర‌ణ్య‌కాండ‌లో శ్రీ‌రాముడు రాక్ష‌స‌గుణాల‌ను న‌శింప‌చేసి ఋషుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాడ‌ని, దీన్ని మోక్ష కాండ అని కూడా అంటార‌ని వివ‌రించారు. ప్ర‌తి ఇంట్లో పారాయ‌ణం చేయ‌డం ద్వారా మంత్ర‌పూరిత‌మైన శ్లోకాల శ‌బ్ద త‌రంగాలు అక్క‌డి వాతావ‌ర‌ణాన్ని పునీతం చేస్తాయ‌న్నారు. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా ప్ర‌తి ఒక్క‌రూ శ్లోక‌పారాయ‌ణం చేయాల‌ని, అలా చేయ‌లేని వారు విని శ్రీ‌వారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరారు.

ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన‌పీఠం ప్రిన్సిపాల్ శ్రీ కెఎస్ఎస్‌.అవ‌ధాని మాట్లాడుతూ రామాయ‌ణంలోని మొత్తం 24 వేల శ్లోకాలను పారాయ‌ణం చేయాల‌ని టిటిడి సంక‌ల్పంగా పెట్టుకుంద‌ని, ఇప్ప‌టివ‌ర‌కు  బాల‌కాండ‌, సుంద‌ర‌కాండ‌, అయోధ్య‌కాండ పారాయ‌ణం పూర్త‌యింద‌ని తెలిపారు. అర‌ణ్య‌కాండలోని 75 స‌ర్గ‌ల్లో 2,454 శ్లోకాలు ఉన్నాయ‌న్నారు. ఈ శ్లోక‌పారాయ‌ణ ద్వారా రాక్ష‌స గుణాలు తొల‌గిపోయి సాత్విక గుణాలు అల‌వ‌డ‌తాయ‌ని చెప్పారు. రామ‌స్య‌పాదౌజ‌గ్రాహ‌ల‌క్ష్మ‌ణ‌స్య‌చ‌ధీమ‌తః అనే మంత్రంలోని అక్ష‌ర‌క్ర‌మం ప్ర‌కారం ఆయా స‌ర్గల్లోని శ్లోక పారాయ‌ణం జ‌రుగుతుంద‌ని తెలియ‌జేశారు. అర‌ణ్య‌కాండ‌ పారాయ‌ణ దీక్ష‌కు జూన్ 24వ‌ తేదీ సాయంత్రం 7 గంట‌ల‌కు తిరుమ‌ల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్ప‌ణ జ‌రుగ‌నుంద‌న్నారు. తిరుమ‌ల‌లోని వ‌సంత‌ మండ‌పంలో ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌ల నుంచి 16 మంది వేద‌, శాస్త్ర పండితుల‌తో పారాయ‌ణ‌దీక్ష చేప‌డ‌తార‌ని చెప్పారు. అలాగే మ‌రో 16 మంది పండితులు ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం ధ‌ర్మ‌గిరి శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద విజ్ఞాన‌పీఠంలో జ‌ప‌, త‌ర్ప‌ణ‌, హోమాదులు ప్ర‌తి శ్లోకానికీ నిర్వ‌హిస్తార‌ని వివ‌రించారు.

అధికారుల స‌మీక్ష‌లో ఎస్వీబీసీ సిఈవో శ్రీ సురేష్‌కుమార్‌, శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, శ్రీ కృష్ణ‌శేషాచ‌ల దీక్షితులు, శ్రీ గోవింద‌రాజ దీక్షితులు ఇత‌ర విభాగాధిప‌తులు  పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.