జూన్ 27న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం

జూన్ 27న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో పుష్పయాగం

తిరుపతి, 2020 జూన్ 25: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 27వ తేదీ శ‌నివారం పుష్పయాగం జ‌రుగ‌నుంది. ఇందుకోసం జూన్ 26న సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు సేనాధిప‌తి ఉత్స‌వం, పుష్పయాగానికి అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

జూన్ 27న  ఉదయం 9.00  గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3.00 గంటల‌ నుండి సాయంత్రం 5.30 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, ప‌త్రాల‌తో స్వామివారికి అభిషేకం చేస్తారు.

ఈ ఆల‌యంలో మే 28 నుండి జూన్ 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జ‌రిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలిసీ తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తార‌ని అర్చ‌కులు తెలిపారు.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ‌ల ఆదేశాల మేర‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ఏకాంతంగా స్న‌ప‌న తిరుమంజ‌నం, వాహ‌న సేవ‌లు, ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.