PAVITROTSAVAM AT SRI KAPILESWARA SWAMY TEMPE FROM JUNE 30 – JULY 2 _ జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

Tirupati, 28 June 2023: TTD is organising a three-day annual Pavitrotsavams from June 30-July 2 with Ankurarpanam on June 29.

The festival is organised as per Agama traditions to ward off the bad impact of any lapses during the year in the temple.

On the first day on June 30, the utsava idols will be offered snapana thirumanjanam in the morning followed by kalasa puja, Homas and Pavitra pratista in the evening. 

On day-2 on July 1, Pavitra samarpana and yagashala puja, Homas will be held while on the last day on July 2 Maha Purnahuti, Kalasa udwasana, Pavitra samarpana will be performed followed by asthanam for all five utsava idols of Sri Kapileswawara, Sri Kamakshi, Sri Vigneswara, Sri Subramanya and Sri Chandikeswara.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, 2023 జూన్ 28: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూన్ 30 నుండి జూలై 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూన్ 29న సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక ఏవైనా దోషాలు జరిగినా, ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా జూన్ 30న మొద‌టిరోజు ఉదయం ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, ‌సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ నిర్వ‌హిస్తారు. జూలై 1న రెండో రోజు ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం చేప‌డ‌తారు. జూలై 2న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి, క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హిస్తారు. ‌సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లకు ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.