జూన్ 4 నుండి 12వ తేది వరకు కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు
జూన్ 4 నుండి 12వ తేది వరకు కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2010 మే 25: కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 4వ తేది నుండి జూన్ 12వ తేది వరకు వైభవంగా జరుగుతాయి. జూన్ 3వ తేదిన అంకురార్పణం నిర్వహిస్తారు.
ఈ బ్రహ్మోత్సవాలలో శ్రీ వేణగోపాల స్వామి వారు ప్రతిరోజు ఈక్రింది వాహనాలను అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారు.
తేది ఉదయం సాయంత్రం
04-06-2010 ధ్వజారోహణం (ఉ.9.10 గంటలకు) పెద్దశేష వాహనం
05-06-2010 చిన్నశేష వాహనం హంస వాహనం
06-06-2010 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
07-06-2010 కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
08-06-2010 పల్లకీ ఉత్సవం (మోహినీ అవతారం) గరుడ సేవ
09-06-2010 హనుమంత వాహనం గజ వాహనం
10-06-2010 సూర్యప్రభ వాహనం చంద్రఫ్రభ వాహనం
11-06-2010 రథోత్సవం (ఉ.8.20 గంటలకు) అశ్వ వాహనం
12-06-2010 చక్రస్నానం (ఉ.10.45 గంటలకు) ధ్వజ అవరోహణం
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.