జూలై నెలలో వార్షిక క్రీడలు

జూలై నెలలో వార్షిక క్రీడలు

తిరుపతి, జూన్‌-17,  2009: తిరుమల తిరుపతి దేవస్థానముల ఉద్యోగినీ,ఉద్యోగులకు ప్రతి సంవత్సరం నిర్వహించే వార్షిక క్రీడలు ఈ సంవత్సరం జూలై నెలలో తిరుపతిలో నిర్వహిస్తారు.

తితిదే ఉద్యోగుల మానసిక వికాసం కొఱకు నిర్వహించే ఈ వార్షిక క్రీడలలో వివిధ రకాల ఆటలు,క్రీడలు ఉంటాయి. తితిదే ఉద్యోగినీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వారికి ప్రావీణ్యం గల క్రీడలలో ఉత్సాహంగా పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది. కనుక ఆసక్తి కలిగిన తితిదే ఉద్యోగస్తులందరూ తమ పేర్లను జూన్‌ నెల 25వ తేదిలోగా తితిదే ఉద్యోగస్థుల సంఘకార్యాలయం నందు నమోదు చేసుకోవాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.