ANDAL TIRUVADIPURAM _ జూలై 13 నుండి 22వ తేదీ వ‌ర‌కుశ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం 

TIRUPATI, 10 JULY 2023: The festival of Andal Tiruvadipuram will be observed in Sri Govindaraja Swamy temple in Tirupati between July 13 to 22.

 

After Tirumanjanam in the morning, Astanam will be performed in the evening during these days.

 

On the last day Andal Ammavaru Sattumora will be observed.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూలై 13 నుండి 22వ తేదీ వ‌ర‌కుశ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాళ్‌ తిరువడిపురం ఉత్సవం

తిరుపతి, 10 జూలై 2023: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 13 వ తేదీ నుండి 22వ తేదీ వ‌ర‌కు శ్రీ ఆండాళ్‌ అమ్మవారి తిరువడిపురం ఉత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉత్సవ రోజుల్లో ఉదయం శ్రీ ఆండాళ్‌ అమ్మవారికి తిరుమంజనం, సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.

జూలై 22న శ్రీ ఆండాళ్‌ అమ్మవారి శాత్తుమొర సంద‌ర్భంగా ఉదయం 9.30 నుండి 10.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని అలిపిరికి ఊరేగింపుగా తీసుకెళ్లి అక్కడ ఆస్థానం నిర్వహిస్తారు. ప్రత్యేకపూజల అనంతరం అలిపిరి నుండి రామనగర్‌ క్వార్టర్స లోని గీతామందిరం ‌, ఆర్‌ఎస్‌ మాడ వీధి లోని
శ్రీ విఖనసాచార్యుల ఆలయం, శ్రీ చిన్నజీయర్‌ మఠం మీదుగా ఊరేగింపు తిరిగి ఆలయానికి చేరుకుంటుంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.