జూలై 18 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం

జూలై 18 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జ్యేష్టాభిషేకం

తిరుపతి, జూలై 17, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూలై 18 నుండి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం (అభిధ్యేయక అభిషేకం) ఘనంగా జరుగనుంది. ఇందులో స్వామివారి స్వర్ణ కవచాలకు మొదటిరోజు కవచ అధివశం, రెండో రోజు కవచ ప్రతిష్ఠ, చివరిరోజు కవచ సమర్పణ నిర్వహిస్తారు. ఈ ఉత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం  మహాశాంతి హోమం, పుణ్యాహవచనం, మధ్యాహ్నం శతకలశస్నపనం, సాయంత్రం వీధి ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రతి ఏడాదీ ఆషాడ మాసం, జ్యేష్టా నక్షత్రం రోజున ఆలయంలో జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.