జూలై 18 నుండి 24వ తేదీ వరకు ధర్మగిరి వేద పాఠశాలలో శ్రీవారి మాదిరి బ్రహ్మోత్సవాలు

జూలై 18 నుండి 24వ తేదీ వరకు ధర్మగిరి వేద పాఠశాలలో శ్రీవారి మాదిరి బ్రహ్మోత్సవాలు

తిరుమల, జూలై 17, 2013: తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో జూలై 18 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి మాదిరి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. మొదటిరోజైన గురువారం ఉదయం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, సేనాధిపతి ఉత్సవం నిర్వహించనున్నారు.

ప్రతిరోజూ ఉదయం 9.30 నుండి 11.00 గంటల వరకు, రాత్రి 7.00 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. మాదిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతం, కొలువు, సహస్రనామార్చన నిర్వహించి ప్రసాద వితరణ చేస్తారు. జూలై 22న గరుడ సేవ, జూలై 23న రథోత్సవం, చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తారు. జూలై 24వ తేదీన పుష్పయాగంతో మాదిరి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ప్రతి ఏటా ఈ ఉత్సవాలను విద్యార్థులు వేద పాఠశాల ఆవరణలో నిర్వహిస్తారు. విద్యార్థులు సృజనాత్మకంగా వాహనాలు రూపొందించి శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని చాటుతారని ప్రిన్సిపాల్‌ ఆచార్య కెఎస్‌ఎస్‌.అవధాని తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.