జూలై 19 నుండి 21వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

జూలై 19 నుండి 21వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి, జూలై 05, 2013: తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 19 నుండి 21వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. జూలై 18వ తేదీన ఈ ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు.
 
వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసీ తెలియక ఇలాంటి దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాల్లో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు ఉంటాయి.
ఈ పవిత్రోత్సవంను ఆర్జితం సేవగా ప్రవేశ పెట్టారు. రూ.500 చెల్లించి ఇద్దరు గృహస్థులు పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు ఒక లడ్డూ, ఉత్తరీయం, రవికె బహుమానంగా అందజేస్తారు.
              
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.