జూలై 2 నుండి 4వ తేది వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం 

జూలై 2 నుండి 4వ తేది వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

తిరుపతి, జూలై 01, 2011: తిరుమల తిరుపతి దేవస్థాములో దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం జూలై 2 నుండి 4వ తేది వరకు మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటలకవరకు ఆంధ్ర, తమిళనాడు ప్రాంతపు భజన మండలులచే సామూహిక భజన, సంకీర్తనలు, హరిదాసు సంకీర్తనల అంత్యాక్షరి, ధార్మిక సందేశాలు, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 2వ తేదిన సాయంత్రం 4 గంటలకు స్థానిక గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణం నుంచి 3వ సత్రం ప్రాంగణం వరకు శోభా యాత్ర నిర్వహిస్తారు. అదేవిధంగా జూలై 4వ తేదిన ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వద్ద వేల సంఖ్యలో వచ్చిన భజన మండలులచే వేడుకగా మెట్లోత్సవాన్ని నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.