జూలై 20వ తేదీ నుండి తమిళనాడులో శ్రీనివాస కళ్యాణాలు

జూలై 20వ తేదీ నుండి తమిళనాడులో శ్రీనివాస కళ్యాణాలు

తిరుపతి, 2012 జూలై 18: తితిదే శ్రీ కళ్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 20వ తేదీ నుండి తమిళనాడు రాష్ట్రంలోని మూడు ప్రముఖ పట్టణాల్లో శ్రీనివాస కళ్యాణాలు జరుగనున్నాయి. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా తితిదే దేశవిదేశాల్లో స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే తమిళనాడులో కళ్యాణాలు తలపెట్టింది. జూలై 20వ తేదీన పళని పట్టణంలో పళని పుష్పకైంకర్య సభ ఆధ్వర్యంలో, జూలై 21వ తేదీన మెట్టూర్‌లో నామగిరి భజనమండలి ఆధ్వర్యంలో, జూలై 23వ తేదీన చెన్నై నగరంలోని పల్లావరం వేల్స్‌ విద్యా ఆశ్రమంలో శ్రీవారి కళ్యాణాలు నిర్వహించనున్నారు. తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ఈ కళ్యాణోత్సవాలను పర్యవేక్షించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.