జూలై 20 నుండి తితిదే ఈ-దర్శన్‌ కౌంటర్లలో వరలక్ష్మీవ్రతం టికెట్లు

జూలై 20 నుండి తితిదే ఈ-దర్శన్‌ కౌంటర్లలో వరలక్ష్మీవ్రతం టికెట్లు

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 27వ తేదీన నిర్వహించ నున్న వరలక్ష్ష్మీ వ్రతానికి సంబంధించిన టికెట్లు జూలై 20వ తేదీ నుండి అన్ని తితిదే ఈ-దర్శన్‌ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- టికెట్‌ కొనుగోలుచేసి వరలక్ష్మీ వ్రతం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా  సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ వ్రతం కారణంగా అమ్మవారి ఆలయంలో ఆర్జితసేవలైన లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేయనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.