జూలై 22 నుండి తితిదే స్థానిక ఆలయాల్లో పుష్పయాగం

జూలై 22 నుండి తితిదే స్థానిక ఆలయాల్లో పుష్పయాగం

తిరుపతి, జూలై 21, 2013: తితిదేకి అనుబంధంగా ఉన్న కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో జూలై 22న, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 23న పుష్పయాగం ఘనంగా జరుగనుంది.

కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో జూలై 22న మధ్యాహ్నం 3.00 నుండి 5.00 గంటల వరకు కన్నులపండుగగా పుష్పయాగం నిర్వహించనున్నారు. అనంతరం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

అదేవిధంగా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 23న మధ్యాహ్నం 3.00 నుండి 5.00 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం, సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
              
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.