జూలై 28, 29వ తేదీల్లో దేవుని కడప శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌వారి ల్యాణం

జూలై 28, 29వ తేదీల్లో దేవుని కడప శ్రీ ల‌క్ష్మీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌వారి ల్యాణం

తిరుపతి, 2010 జూలై 22: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో దేవుని కడపనందు ఈనెల 28, 29 వ తేదీలలో శ్రీవారి కల్యాణం, ఊంజల్‌సేవలు కన్నుల పండుగగా జరుగుతాయి.

శ్రీవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడానికి తితిదే అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. శ్రీవారి కల్యాణ అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేస్తారు. అదేవిధంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే ఈరెండు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

తమిళనాడు రాష్ట్రం సీకినికుప్పం నందు ఈనెల 24వ తేదిన శ్రీవారి కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

లోకల్‌ అడ్వైజరీ కమిటి చెన్నై వారి సహకారముతో తితిదే ఈ శ్రీవారి కల్యాణాన్ని జరుపుతున్నది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.