జూలై 3న సహాయ స్తపతి ఉద్యోగాల భర్తీకి వ్రాత పూర్వక పరీక్షలు  

జూలై 3న సహాయ స్తపతి ఉద్యోగాల భర్తీకి వ్రాత పూర్వక పరీక్షలు  

 తిరుపతి, జూన్‌ 27, 2011: తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో అలిపిరి బస్టాండ్‌ చెంత నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణా సంస్థలో (స్విట్స) ఖాళీగా ఉన్న 10 సహాయ స్తపతి ఉద్యోగ నియామకాల కొరకు జూలై 3వ తేదిన వ్రాత మరియు ప్రాక్టికల్‌  పరీక్షలు జరుగనున్నాయి.
 
ఈ మేరకు ఈ పరీక్షల యొక్క పాఠ్యప్రణాళిక (సిలబస్‌) వివరాలను, పరీక్షా విధానాన్ని, పాటించాల్సిన నియమాలను ఇప్పటికే అర్హులైన అభ్యర్థులకు కాల్‌ లెటర్లను పంపడం జరిగినది.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.