SRI SUNDARARAJA SWMY AVATAROTSAVAMS FROM JULY 9-11 _ జూలై 9 నుండి 11వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతారోత్సవాలు

Tirupati, 7 Jul. 20: TTD is organising the three day annual Avatarotsavam festival of Sri Sundararajaswami, a sub-shrine in Sri Padmavati Ammavari temple complex at Tiruchanoor from July 9-11th in Ekantham in view of Covid-19 restrictions.

On all these three days, Snapana Tirumanjanam is performed to the utsava idols of Sri Sundararaja swami at the Sri Krishna Mukha Mandapam followed by Unjal seva in the evening.

Ahead of the festival TTD organised, Koil Alwar Tirumanjanam, cleansing of the temple premises on Tuesday morning.

Temple legend show that the utsava idols of Sri Sundararaja swami located in the Alagiya Perumal Koil of Madurai was brought to Tiruchanoor when it was raided by Muslim kings.

The avatarotsavam is celebrated every year in recognition of the transfer of the utsava idols to Tiruchanoor.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

జూలై 9 నుండి 11వ తేదీ వరకు శ్రీ సుందరరాజస్వామివారి వార్షిక అవతారోత్సవాలు

తిరుపతి, 2020 జూలై 07: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి అవతారోత్సవాలు జూలై 9 నుండి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ ఉత్స‌వాల‌ను ఆల‌య ప్రాంగ‌ణంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

ఈ మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు శ్రీ కృష్ణస్వామి ముఖమండపంలో శ్రీ సుందరరాజస్వామివారికి తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు శ్రీ సుంద‌ర‌రాజ‌స్వామివారికి ఊంజల్‌ సేవ నిర్వ‌హిస్తారు.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

అవతారోత్సవాలను పుర‌స్క‌రించుకుని శ్రీ సుందరరాజ స్వామివారి ఆల‌యంలో మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర  వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

సంక్షిప్త సమాచారం :

శ్రీ సుందరరాజస్వామివారి అవతారోత్సవాల పురాణ నేపథ్యాన్ని పరిశీలిస్తే చాలా సంవత్సరాల క్రితం ముష్కరులు మధురైలో ఉన్న అళగిరి పెరుమాళ్‌ కోయిల్‌ను కూల్చేందుకు ప్రయత్నించారట. ఆ సమయంలో అక్కడున్న అర్చకస్వాములు శ్రీ సుందరరాజస్వామివారి ఉత్సవమూర్తులను తిరుచానూరుకు తీసుకొచ్చారని ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే స్వామివారి విగ్రహాలు(ఉత్సవర్లు) పురాతనంగా కనిపిస్తున్నాయి. మహంతుల కాలంలో అనగా 1902వ సంవత్సరంలో మూలమూర్తులను తయారుచేసి ప్రతిష్ఠించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆ తరువాత సుందరరాజస్వామివారికి అనేక ఉత్సవాలు జరిగాయి. స్వామివారిని తిరుచానూరుకు తీసుకొచ్చిన సంద‌ర్భాన్ని గుర్తు చేస్తూ అవ‌తారోత్స‌వాలు నిర్వ‌హిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.