GRAND FAREWELL TO OUTGOING JEO (H&E) _ జెఈవో శ్రీమతి సదా భార్గవి ఎంతో సమర్థురాలు- టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి
Tirupati, 09 February 2024: TTD EO Sri AV Dharma Reddy complimented JEO ( Health and Education) Smt Sada Bhargavi for her dedicated and excellent services over the last four years in TTD.
As chief guest at the farewell function on Friday evening held in Mahati auditorium on her transfer the EO and other TTD officials grandly felicitated the outgoing JEO(H&E) for her contributions towards the round development of TTD.
Highlighting her contributions in the development of health, hospitals and education in TTD,the EO lauded her role in safeguarding several crores worth of TTD properties, Marketing and Procurement, Dharmika activities and many more.
Among others the SLSMPC corporation, heart transplants, inviting large number of cultural teams for Brahmotsavam from 14 states were possible due to her energetic and overwhelming role, he said.
Thereafter JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, SVIMS Director Prof RV Kumar, CAuO Sri Sesha Shailendra, Pancharatra Agama Advisor Sri Srinivasacharyulu, Estates Special Officer Sri Mallikarjuna, Catering Special Officer Sri GLN Shastri and many employees also spoke and lauded her performance in TTD.
In her speech, Smt Sada Bhargavi termed the entire TTD workforce as her family of brothers and sisters and thanked everyone for offering their support in fulfilling all the tasks assigned to her in the last four years.
Dyeo welfare Smt Snehalata presided over the function in which FA and CAO Sri O Balaji, SVBC CEO Sri Shanmukh Kumar, Law officer Sri Veeraju transport GM Sri Sesha Reddy, DyEO Sri Govindarajan and other HODs, DyEOs, Doctors and others were present.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
జెఈవో శ్రీమతి సదా భార్గవి ఎంతో సమర్థురాలు
• టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి
టీటీడీలో పనిచేయడం పూర్వజన్మ సుకృతం
• బదిలీపై వెళుతున్న జెఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2024, ఫిబ్రవరి 09: టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి దాదాపు నాలుగేళ్ల పాటు ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని, ఈవోగా తాను అప్పగించిన పనులను ఎంతో చిత్తశుద్ధితో చేశారని టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి కొనియాడారు. శ్రీమతి సదా భార్గవి బదిలీ సందర్భంగా తిరుపతిలోని మహతి కళామందిరంలో శుక్రవారం సాయంత్రం ఆత్మీయ వీడ్కోలు సభ జరిగింది. ఈ సందర్భంగా ఈవో శ్రీ ధర్మారెడ్డితో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు శ్రీమతి సదా భార్గవిని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈవో మాట్లాడుతూ శ్రీమతి సదా భార్గవి టీటీడీలో ఆరోగ్యం, విద్య విభాగాలతోపాటు ఇతర విభాగాలను చక్కగా నిర్వహించారని తెలియజేశారు. సిమ్స్ ఆసుపత్రిని ఆరు నెలల్లో ఎంతో అభివృద్ధి చేసి రోగుల్లో విశ్వాసం పెంచారని చెప్పారు. అదేవిధంగా అవయవ మార్పిడి కోసం స్విమ్స్ లో అన్ని వసతులు కల్పించారని, తద్వారా మొదటిసారి మూడు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. టీటీడీ డిగ్రీ కళాశాలలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడుతో పాటు అటానమస్ హోదా లభించేందుకు ఎంతో కృషి చేశారని, విద్యాసంస్థల్లో 120 జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేశారని వెల్లడించారు. చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షించారని, దాదాపు నిర్మాణం పూర్తి కావచ్చిందని అన్నారు. గత బ్రహ్మోత్సవాల్లో నైపుణ్యం గల కళాబృందాలను ఎంపిక చేసి భక్తుల మన్ననలు అందుకున్నారని చెప్పారు. సంవత్సరానికి దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ గల కొనుగోళ్లు, వేర్ హౌసింగ్ విభాగాన్ని చక్కగా నిర్వహించి టీటీడీకి అవసరమైన సరుకులను సకాలంలో అందేలా చర్యలు చేపట్టారని చెప్పారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో జెఈవో ప్రముఖ పాత్రను పోషించారని తెలియజేశారు.
బదిలీపై వెళ్తున్న జెఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ టీటీడీలో మూడు సంవత్సరాల ఎనిమిది నెలలు పని చేసే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. తల్లిదండ్రుల ఆశీస్సులతోనే స్వామివారి సన్నిధిలో అంకితభావంతో సేవలు అందించానని చెప్పారు. టీటీడీ ఉద్యోగులు ఎంతో అదృష్టవంతులని, పూర్తి కాలం పాటు ఇక్కడే ఉండి భక్తులకు సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలియజేశారు. తన ఉద్యోగ కాలంలో సహకరించిన టీటీడీ మాజీ ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ప్రస్తుత ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, అప్పటి ఈవోలు శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి, ప్రస్తుత ఈవో శ్రీ ఏవీ.ధర్మారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మంకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీటీడీ ఛైర్మన్, ఈవోలు తనకు అప్పగించిన బాధ్యతలను ఎంతో అంకితభావంతో నిర్వర్తించానన్నారు. ఇందులో టీటీడీ ఆస్తుల శ్వేతపత్రం సిద్ధం చేయడం, విద్యాసంస్థలకు అటానమస్ హోదా, 119 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించడం, ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ వర్తింప చేయడం తదితరాలు ఉన్నాయన్నారు.
అదేవిధంగా శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 6800 మంది ఓట్సోర్సింగ్ ఉద్యోగులకు శ్రీవారి దర్శనం, గుర్తింపు కార్డు, లడ్డూ ప్రసాదం ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె ఆసుపత్రి ద్వారా ఇప్పటివరకు 11 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయని తెలియజేశారు. పురాణ ఇతిహాస ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు ఎనిమిది పురాణాల ముద్రణ పూర్తిచేశామన్నారు. గతేడాది జరిగిన శ్రీవారి రెండు బ్రహ్మోత్సవాల్లో దాదాపు 14 రాష్ట్రాల నుండి కళాబృందాలను ఆహ్వానించామన్నారు. అదేవిధంగా ఆయుర్వేద కళాశాల, పరకామణి విభాగం, గోశాల, వైద్య విభాగం తదితర విభాగాల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. తమకు సహకరించిన అన్ని విభాగాల అధిపతులు, ఇతర అధికారులు, ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
జెఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ టీటీడీలో మొదటి మహిళా ఐఏఎస్ అధికారిగా శ్రీమతి సదా భార్గవి చరిత్ర సృష్టించారని తెలిపారు. విద్యాసంస్థలను, ఆసుపత్రులను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారని చెప్పారు. గత ఏడాది రథసప్తమి, రెండు బ్రహ్మోత్సవాల్లో చక్కటి కళాబృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు. కరోనా సమయంలో ఉద్యోగులకు చక్కటి వైద్య సేవలు అందించారని కొనియాడారు.
టీటీడీ సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ జెఈవో శ్రీమతో సదా భార్గవికి ఏ బాధ్యతలు అప్పగించినా తనదైన శైలిలో ఎంతో చక్కగా నిర్వహించారని చెప్పారు. శుద్ధ తిరుమల – సుందర తిరుమల కార్యక్రమాన్ని చక్కగా పర్యవేక్షించారని తెలియజేశారు.
సిమ్స్ డైరెక్టర్ మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ స్విమ్స్ ఇన్ఛార్జి డైరెక్టరుగా శ్రీమతి సదా భార్గవి పాలనను గాడిన పెట్టారని, పదేళ్లుగా పెండింగులో ఉన్న డాక్టర్లకు ప్రమోషన్లు కల్పించారని వివరించారు. అనంతరం ముఖ్య గణాంకాధికారి శ్రీ శేషశైలేంద్ర, డిఇఓ డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డి, పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ శ్రీనివాసాచార్యులు, ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి శ్రీ మల్లికార్జున, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి శ్రీ శాస్త్రితో పాటు పలువురు ఉద్యోగులు ప్రసంగించారు.
టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈవో శ్రీ షణ్ముఖ్ కుమార్, న్యాయాధికారి శ్రీ వీర్రాజు, ఎఫ్ఏసిఏఓ శ్రీ బాలాజీ, రవాణా జిఎం శ్రీ శేషారెడ్డి, డెప్యూటీ ఈఓ శ్రీ గోవిందరాజన్, ఇతర విభాగాధిపతులు, పలువురు డెప్యూటీ ఈవోలు, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.