SUSPENSION OF SPECIAL DARSHAN FOR AGED, CHALLENGED, PARENTS WITH INFANTS AND DONORS IN VIEW OF NEW YEAR AND VAIKUNTA EKADASI _ జ‌న‌వ‌రి 1, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా దాత‌ల‌కు, వృద్ధుల‌కు ప్రత్యేక దర్శనాలు నిలుపుదల

జ‌న‌వ‌రి 1, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా దాత‌ల‌కు, వృద్ధుల‌కు ప్రత్యేక దర్శనాలు నిలుపుదల

తిరుమ‌ల‌, 2019 డిసెంబ‌రు 17: నూతన ఆంగ్ల సంవత్సరాది, వైకుంఠ ఏకాద‌శి సందర్భంగా తిరుమల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం విశేషంగా విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దాత‌ల‌కు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు, వృద్ధులు, దివ్యాంగులకు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలను నిలుపుద‌ల చేయ‌డ‌మైన‌ది. ఈ విష‌యాల‌ను గ‌మ‌నించి స‌హ‌క‌రించాల‌ని టిటిడి విజ్ఞ‌ప్తి చేస్తోంది.

నూతన ఆంగ్ల సంవత్సరాది సంద‌ర్భంగా డిసెంబరు 30 నుండి జనవరి 1వ తేదీ వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుండి 7వ తేదీ వరకు దాతలకు ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపును నిలిపివేయ‌డ‌మైన‌ది.

అదేవిధంగా, భక్తుల రద్దీ నేపథ్యంలో నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుండి 7వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది. 

 

Tirumala, 17 Dec. 19: The special darshan for aged , challenged and parents with infants has been cancelled for a period of few days in view of New Year and Vaikuntha Ekadasi pilgrim rush to Tirumala.

The special darshan and room allotment for donors have been cancelled from December 30-January 1 and later on from January 4-January 7.

Similarly for aged, challenged and parents with 5-year-old children, special darshan has been cancelled from December 31- January 1 and also from January 5- January 7.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI