జ‌న‌వ‌రి 24న తిరుమలలో శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవం

జ‌న‌వ‌రి 24న తిరుమలలో శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవం

తిరుమల, 2020 జ‌న‌వ‌రి 01: కర్ణాటక సంగీత పితామహుడు శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవం జ‌న‌వ‌రి 24న తిరుమలలో ఘ‌నంగా జ‌రుగ‌నుంది.

ఈ సంద‌ర్భంగా సాయంత్రం స‌హ‌స్ర దీపాలంకార సేవ అనంత‌రం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల‌కు వేంచేపు చేస్తారు. అక్క‌డున్న శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌య మండ‌పంలో  శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ క‌ళాకారులు శ్రీ పురంద‌ర‌దాస కీర్త‌న‌ల‌ను బృంద‌గానం చేస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.