PRIVILEGED DARSHAN ON JAN 28 AND 29 _ జ‌న‌వ‌రి 28న‌ వృద్ధులు, దివ్యాంగులకు, 29న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

Tirumala, 25 Jan. 20: The privileged darshan for senior citizens, physically challenged and parents with 5 years old children with hassle free special Darshan on two days in a month is slated on January 28 and 29.

As a part of the program TTD is providing 4000 tokens on January 28 to Senior citizens who have crossed 65years and physically challenged persons in three time slots including 1000 tokens in 10am, 2000 in the afternoon at 2pm and 1000 tokens at 3pm slot.

TTD appealed to all the devotees falling under this category to make use of this darshan facility.

Similarly on January 29, parents with five year old children will be provided Srivari darshan facility from 9am up to 1.30 pm through Supatham route. It may be noted that during normal days, parents with one-year-old infants are provided Srivari Darshan through Supatham route.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

జ‌న‌వ‌రి 28న‌ వృద్ధులు, దివ్యాంగులకు, 29న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

తిరుమల, 2020 జ‌న‌వ‌రి 25 : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం ఎక్కువ మంది వయో వృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.

ఇందులో భాగంగా  జ‌న‌వ‌రి 28న మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

అదేవిధంగా, జ‌న‌వ‌రి 29న బుధ‌వారం 5 సంవత్సరాలలోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటిపిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.