TTD TO PLACE PURANA EPICS IN PUBLIC DOMAIN- TTD JEO _ జ‌న ‌బాహుళ్యంలోకి పురాణ ఇతిహాసాలు : జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి‌

Tirupati, 23 Feb. 21: TTD Joint Executive Officer (Health & Education) Smt Sada Bhargavi has urged pundits to speed up the Telugu translation of epic Puranas to fulfil the TTD’s agenda of Sanatana Hindu Dharma propagation to place all such epics in public domain within stipulated time.

The JEO on Tuesday evening inspected the ongoing translation activity of Astadasa puranams at SVETA Bhavan.

Speaking, she directed officials to complete the translation of the Agni Puranam and publish it by Ugadi.

Later OSD of the project Acharya Dakshinamurthy explained the progress of the translation work of Astadasha Puranam to the JEO.

Eminent pundits Dr Samudrala Lakshmaiah Dr K Surya Narayana, Dr S Satyanarayana Murthy, Dr K Pratap, Dr Suram Srinivasulu, Dr D Krishnamurthy, Dr G Prabhakar Sharma, Dr Trishulpani, Dr Samudrala Dasharath, and Sri SBS Pani also participated.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జ‌న ‌బాహుళ్యంలోకి పురాణ ఇతిహాసాలు : జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి‌

తిరుపతి, 2021 ఫిబ్ర‌వ‌రి 23: ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా పురాణ ఇతిహాసాల‌ను జ‌న‌బాహుళ్యంలోకి తీసుకురావాడానికి అనువాద కార్య‌క్రమాన్ని త్వ‌ర‌త గ‌తిన పూర్తి చేయాల‌ని జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి పండితుల‌ను కోరారు. తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న అష్టాద‌శ పురాణాల అనువాద ప‌నుల‌ను జెఈవో(ఆరోగ్యం, విద్య‌) శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ పురాణ ఇతిహాస ప్రాజెక్టు ఆధ్వ‌ర్యంలో అగ్నిపురాణం సంస్కృతం నుండి తెలుగులోకి అనువాదం జ‌రుగుతున్నద‌ని, దీనిని ఉగాది ప‌ర్వ‌దినంలోపు ముద్ర‌ణ పూర్తి చేయాల‌ని ఆదేశించారు. పురాణ వాజ్ఞ‌య సేవ స‌మాజానికి మేలు చేస్తుంద‌ని పండితుల‌ను ప్ర‌శంసించారు. వీలైనంత త్వ‌ర‌గా అష్టాద‌శ పురాణాల అనువాదాన్ని పూర్తి చేసి, ముద్రించాల‌న్నారు.

ఈ సంద‌ర్బంగా ప్రాజెక్టు ప్ర‌‌త్యేకాధికారి ఆచార్య ద‌క్షిణామూర్తి శ‌ర్మ ప్రాజెక్టులో జ‌రుగుతున్న ప్ర‌గ‌తిని, అభివృద్ధి కార్య‌క్ర‌మాలను జెఈవోకు వివ‌రించారు.

ఈ అనువాద కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ పండితులు డా. స‌ముద్రాల లక్ష్మ‌ణ‌య్య‌, డా. కె.‌సూర్య నారాయ‌ణ‌, డా. ఎస్‌.స‌త్య‌నారాయ‌ణ మూర్తి, డా.కె.ప్ర‌తాప్‌, డా.సూరం శ్రీ‌నివాసులు, డా. డి.ప్ర‌భాక‌ర కృష్ణ‌మూర్తి, డా. జి.ప్ర‌భాక‌ర శ‌ర్మ‌, డా.త్రిశూల‌పాణి, డా.‌స‌ముద్రాల ద‌శ‌ర‌థ‌, శ్రీ య‌స్‌.బి.య‌స్‌.పాణి పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.