TTD EO INAUGURATES TTD VIGILANCE WEEK CELEBRATIONS _ టిటిడిలో విజిలెన్స్ వారోత్స‌వాలు ప్రారంభించిన ఈవో డా.జ‌వ‌హ‌ర్ ‌రెడ్డి

Tirupati, 27 Oct. 20: TTD Executive officer Dr K S Jawahar Reddy on Tuesday morning inaugurated the   Vigilance Week Celebrations.

The vigilance week is celebrated across the country at the behest of the Central Vigilance Commission to highlight the campaign for promoting national integrity, vigilance awareness and against corruption in Public life.

As part of the celebrations and under the leadership of CVSO Sri Gopinath Jatti, a pledge was sworn by all TTD staff and officers to adhere to moral practices of fighting corruption, transparency and service orientation, national integrity and vigilance awareness in public life.

It may be mentioned here that the birth anniversary of Steel Man of India Sardar Vallabhbhai Patel is observed as the vigilance week across the country.

TTD additional .EO Sri A V Dharma Reddy, JEOs Sri P Basant Kumar, Smt Sada Bhargavi, CE Sri Ramesh Reddy, additional CVSO Sri Shivkumar Reddy, VGOs Sri Bali Reddy and Sri Manohar were present.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడిలో విజిలెన్స్ వారోత్స‌వాలు ప్రారంభించిన ఈవో డా.జ‌వ‌హ‌ర్ ‌రెడ్డి

అక్టోబ‌రు 27, తిరుప‌తి 2020: కేంద్ర విజిలెన్స్ క‌మిష‌న్(సివిసి) పిలుపు మేర‌కు దేశ వ్యాప్తంగా ‌అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు నిర్వ‌హిస్తున్న అవినీతి వ్య‌తిరేక‌, భ‌ద్ర‌తా అవ‌గాహ‌న వారోత్సవాలను మంగ‌ళ‌వారం టిటిడి ఈవో డా. కెఎస్.జవహర్ రెడ్డి ప్రారంభించారు. 

మంగ‌ళ‌వారం ఉద‌యం సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి ఆధ్వ‌ర్యంలో  టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నం వ‌ద్ద  అన్ని విభాగాల ఆధిపతులు, ఉద్యోగులతో తాము అవినీతికి వ్య‌తిరేకంగా తాము సంస్థ ప్ర‌యోజ‌నాలు కాపాడుతూ ప‌ని చేస్తామ‌ని ఈవో ప్ర‌తిజ్ఞ చేయించారు. ఉద్యోగులు, అధికారులు నైతిక ధోర‌ణిని ప్రోత్స‌హిస్తూ, నిజాయి‌తి, స‌మైక్య‌త‌తో పార‌ద‌ర్శ‌క సేవ‌లు అందిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. అక్టోబ‌రు 31న ఉక్కుమ‌నిషి స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జయంతిని పుర‌స్క‌రించుకుని ప్రారంభ‌మైన ఈ వారోత్స‌వాలు న‌వంబ‌రు 2వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, జెఈవోలు శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి,సిఇ శ్రీ ర‌మేష్ రెడ్డి, అద‌న‌పు సివిఎస్వో శ్రీ శివ‌కుమార్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, శ్రీ మ‌నోహ‌ర్‌ పాల్గొన్నారు.‌ 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.