PHALGUNI UTTARA UTSAVA AT TTD TEMPLES _ టిటిడి అనుబంధ ఆలయాలలో పంగుణి ఉత్తర ఉత్సవం ప్రారంభం

Tirupati, 22 March 2021: As part of its Dharmic agenda TTD organised Phalguni Uttara Utsavam at its subsidiary temples of Sri Govindaraja Swamy temple and Sri Kalyana Venkateshwara Temple, Narayanavanam on Monday in ekantham in view of Covid guidelines.

The Phalguna festivities will continue till March 28. During the festivities, daily morning Thirumanjanam will be performed to Goddess Sri Padmavati at Narayabavanam and Goddess Sri Pundarikavalli at Sri Govindaraja Swamy Temple, Tirupati in ekantham.

Thereafter in the evening Prahara Utsavam, Unjal Seva and Asthanam will be conducted to bless devotees.

Vedic pundits say that Phalguni Uttara Utsavam was conducted every year as a tradition to mark the ekantham period of Ammavaru- Seivru.

Special grade DyEO Sri Rajendrudu, AEO Sri Ravi Kumar Reddy, Superintendent Sri Venkatadri, Inspectors Sri Munindrababu and Sri Kamaraj, archakas and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI 

టిటిడి అనుబంధ ఆలయాలలో పంగుణి ఉత్తర ఉత్సవం ప్రారంభం

తిరుపతి, 2021 మార్చి 22: టిటిడికి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయాల్లో సోమ‌వారం పంగుణి ఉత్తర ఉత్సవాలు ఏకాంతంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మార్చి 28న ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

ఇందులో భాగంగా నారాయణవనంలోని శ్రీ పద్మావతి అమ్మవారిని, తిరుపతిలోని శ్రీపుండరీకవళ్లి అమ్మవార్లను ప్రతిరోజూ సుప్రభాతంతో మేల్కొలిపి ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు అమ్మవారి ప్రాకార ఉత్సవం, ఊంజల్‌సేవ, ఆస్థానం చేప‌డ‌తారు. అమ్మవారితో శ్రీవారు ఏకాంతంగా గడిపిన రోజును పురస్కరించుకుని పంగుణి ఉత్తర ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు.

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ‌ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీ వెంక‌టాద్రి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునీంద్ర‌బాబు, శ్రీ కామ‌రాజు, అర్చ‌కులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.‌

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.