TABLE TENNIS AND SHUTTLE HELD _ టిటిడి క్రీడాపోటీల్లో ప్రత్యేక ప్రతిభావంతుల ప్రతిభ
Tirupati, 21 Feb. 22: On the penultimate day of the ongoing annual sports meet of TTD in Tirupati, Table Tennis and Shuttle games were held on Monday to the category of physically challenged employees.
These specially able employees showcased their skills and participated with enthusiasm.
Games were also held to retired employees.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
టిటిడి క్రీడాపోటీల్లో ప్రత్యేక ప్రతిభావంతుల ప్రతిభ
తిరుపతి, 2022 ఫిబ్రవరి 21: టిటిడి ఉద్యోగుల క్రీడా పోటీలు సోమవారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఆవరణంలో గల పరేడ్ మైదానం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగాయి. ఇందులో పలువురు ప్రత్యేక ప్రతిభావంతులైన ఉద్యోగులు ప్రతిభ కనబరిచారు.
టేబుల్ టెన్నిస్…
– ప్రత్యేక ప్రతిభా వంతుల మహిళా ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీలలో శ్రీమతి సౌజన్య విజయం సాధించగా, శ్రీమతి ప్రియాంక రన్నరప్‌గా నిలిచారు. డబుల్స్ పోటీలలోశ్రీమతి తులసమ్మ, శ్రీమతి అరుణకుమారి జట్టు విజయం సాధించగా, శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి గంగ రన్నరప్‌గా నిలిచారు.
– ప్రత్యేక ప్రతిభా వంతుల పురుష ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీలలో శ్రీ రెడ్డెప్ప విజయం సాధించగా, శ్రీమణి చంద్రన్ రన్నరప్‌గా నిలిచారు. డబుల్స్ పోటీలలో శ్రీ భాస్కర్, శ్రీ సత్యం జట్టు విజయం సాధించగా, శ్రీ ముని కిరణ్ కుమార్, శ్రీ రవి కుమార్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
షటిల్
– బధిర పురుష ఉద్యోగుల షటిల్ సింగిల్స్ పోటీలలో శ్రీ సునీల్ కుమార్ విజయం సాధించగా, శ్రీ రెడ్డెప్ప రన్నరప్‌గా నిలిచారు. డబుల్స్ పోటీలలో శ్రీ శ్రీకాంత్, శ్రీ రెడ్డెప్ప జట్టు విజయం సాధించగా, శ్రీ హరిహర ప్రసాద్, శ్రీ సునీల్‌కుమార్ రన్నరప్‌గా నిలిచారు.
– బధిర మహిళా ఉద్యోగుల షటిల్ సింగిల్స్ పోటీలలో శ్రీమతి సంపూర్ణ విజయం సాధించగా, శ్రీమతి ప్రసన్న రన్నరప్‌గా నిలిచారు. డబుల్స్ పోటీలలో శ్రీ శ్రీకాంత్, శ్రీ రెడ్డెప్ప జట్టు విజయం సాధించగా, శ్రీ హరిహర ప్రసాద్, శ్రీ సునీల్‌కుమార్ రన్నరప్‌గా నిలిచారు.
– విశ్రాంత మహిళా ఉద్యోగుల షటిల్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి పద్మావతి విజేతగా నిలవగా, శ్రీమతి లలిత రన్నరప్‌గా నిలిచారు. డబుల్స్ పోటీలలో శ్రీమతి లలితమ్మ, శ్రీమతి సుమతి జట్టు విజయం సాధించగా, శ్రీమతి పుష్ప, శ్రీమతి నిర్మల జట్టు రన్నరప్ గా నిలిచారు.
– విశ్రాంత పురుష ఉద్యోగుల షటిల్ సింగిల్స్ పోటీల్లో శ్రీ సుధాకర్ రావు విజేతగా నిలవగా, శ్రీ దామోదర్ రెడ్డి రన్నరప్‌గా నిలిచారు. డబుల్స్ పోటీలలో శ్రీ సుధాకర్ రావు, శ్రీ రవి ప్రభాకర్ జట్టు విజయం సాధించగా, శ్రీ దామోదర్ రెడ్డి, శ్రీ సుబ్బన్న జట్టు రన్నరప్ గా నిలిచింది.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.