FIRST WOMAN JEO FOR TTD _ టిటిడి జెఈవో(విద్య, ఆరోగ్యం)గా శ్రీమతి ఎస్.భార్గవి బాధ్యతల స్వీకరణ
Tirupati, 20 May 20: In first of its kind, Smt S Bhargavi, IAS has assumed charges as Joint Executive Officer (Medical and Education) of TTD on Wednesday.
She took over the charge in TTD Administrative Building in Tirupati amidst the Vedasirvachanam by Vedic pundits in JEO Chamber.
Later she formally met TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal at SPRH in Tirupati and later also met Additional EO Sri AV Dharma Reddy, JEO Sri P Basant Kumar and CVSO Sri Gopinath Jatti.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి జెఈవో(విద్య, ఆరోగ్యం)గా శ్రీమతి ఎస్.భార్గవి బాధ్యతల స్వీకరణ
తిరుపతి, 20 మే 2020: తిరుమల తిరుపతి దేవస్థానముల జెఈవో(విద్య, ఆరోగ్యం)గా శ్రీమతి ఎస్.భార్గవి బుధవారం ఉదయం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జెఈఓ కార్యాలయంలో వేద పండితులు పూజలు నిర్వహించి వారికి ఆశీస్సులు అందించారు.
అనంతరం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్ కుమార్ కుమార్ సింఘాల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ తర్వాత టీటీడీ అదనపు ఈవో శ్రీఏవి.ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో శ్రీ పి.బసంత్ కుమార్ , సివి ఎస్ ఓ శ్రీ గోపినాథ్ జెట్టీ లను మర్యాదపూర్వకంగా కలిశారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.