ENDOWMENT SECRETARY TAKES OATH AS EX-OFFICIO MEMBER OF TTD BOARD _ టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రమాణస్వీకారం
Tirumala, 27 Feb 2021: Dr G. Vani Mohan, Principal Secretary of AP Endowments, on Saturday morning sworn-in as Ex-officio member of the TTD trust board at Srivari temple in Tirumala.
TTD Additional EO Sri AV Dharma Reddy served the oath of office on Dr Vani Mohan. Thereafter Vedic pundits blessed her with Veda Ashirvadam and the Additional EO presented her Srivari laminated photo, Thirtha Prasadam, diary and calendar.
TTD board cell DyEO Smt Sudha Rani and other officials were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రమాణస్వీకారం
తిరుమల, 2021 ఫిబ్రవరి 27: రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డా.జి.వాణి మోహన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలో టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫిషియో సభ్యురాలిగా ప్రమాణస్వీకారం చేశారు. టిటిడి అదనపు ఈవో శ్రీ ఎ.వి.ధర్మారెడ్డి డా.జి.వాణి మోహన్ తో ప్రమాణం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తరువాత అదనపు ఈవో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని, డైరీ, క్యాలెండర్ ను వారికి అందించారు.
ఈ కార్యక్రమంలో బోర్డు సెల్ డెప్యూటీ ఈఓ శ్రీమతి సుధారాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.