టిటిడి పరిపాలన‌ భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

టిటిడి పరిపాలన‌ భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2022 జ‌న‌వ‌రి 25: తిరుపతి టిటిడి పరిపాలన‌ భవనంలో జనవరి 26వ తేదీ బుధ‌వారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోవిడ్ – 19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తారు.

పరిపాలన‌ భవనం వెనక వైపున గల ప‌రేడ్‌ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విధినిర్వ‌హ‌ణ‌లో ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన‌ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేస్తారు

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.