టిటిడి పరిపాలన భవనంలో గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2021 జనవరి 25: తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో జనవరి 26వ తేదీ మంగళవారం నిర్వహించనున్న గణతంత్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పరిపాలన భవనం వెనక వైపున గల పరేడ్ మైదానంలో టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ఉత్తమ అవార్డులు అందజేయనున్నారు. ఈ సందర్భంగా టిటిడి విద్యాసంస్థల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.