టిటిడి పాఠశాలలను పరిశీలించిన జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
టిటిడి పాఠశాలలను పరిశీలించిన జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి
తిరుపతి, 2020 అక్టోబర్ 21: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్నపాఠశాలలను జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) శ్రీమతి సదా భార్గవి బుధవారం పరిశీలించారు.
ఇందులో భాగంగా ఎస్జిఎస్ హైస్కూల్, ఎస్వీ ఒరియంటల్ హైస్కూల్, ఎస్వీ బాలమందిర్, ఎస్వీ ఎలిమెంటరీ స్కూల్, ఎస్వీ శ్రవణం ప్రాజెక్టులను పరిశీలించారు. టిటిడి పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను, పారిశుద్ధ్య ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ – 19 దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల నిబంధనల మేరకు పాఠశాలలను ప్రారంభించడానికి ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆమోదం తీసుకోవాలని, ఆన్లైన్ క్లాసులపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా పాఠశాలలో అవసరమైన సివిల్, ఎలక్ట్రికల్, వాటర్ వర్క్స్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం పాఠశాలల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
జెఈఓ వెంట టిటిడి డిఇవో శ్రీ రమణ ప్రసాద్, ఇతర ఇంజినీరింగ్ అధికారులు ఉన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.