TTD SCHOOLS GETS ISO CERTIFICATION _ టిటిడి పాఠ‌శాల‌లకు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్‌

Tirupati, 04 October 2021: TTD Executive Officer Dr KS Jawahar Reddy on Monday presented the ISO – 9001 certificates to all the HMs of TTD run schools and complimented their efforts.

 

Handing over the certificates at his chambers in the TTD Administrative Building, the TTD EO said the Institutions had bagged the universal recognition of ISO-9001 for their excellence in Quality Management System (ISO-9001), Environmental Management System (ISO-14001) and workplace safety measures.

 

Sri Alapati Sivaiah MD of HyM International Certification Pvt Ltd lauded the cleanliness, Garbage handling, Good Hygienic Practices and Implementation of Covid-19 guidelines in the TTD schools.

 

The TTD EO congratulated all the HMs for maintenance of educational standards environmental protection, power conservation and for documentation in the TTD institutions.

 

TTD JEO for Education and Health Smt Sada Bhargavi, TTD Education Officer Sri C Govindarajan were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టిటిడి పాఠ‌శాల‌లకు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్‌- ఈవో చేతుల‌మీదుగా ప్ర‌ధానోపాధ్యాయుల‌కు అందించిన ఐఎస్ఓ బృందం

తిరుప‌తి, 2021 అక్టోబ‌రు 04: టిటిడి నిర్వ‌హ‌ణ‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ ప‌ద్మావ‌తి ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ గోవింద‌రాజ స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, శ్రీ కోదండ‌రామ‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, ఎస్వీ ఒరియంట‌ల్ ఉన్న‌త పాఠ‌శాల‌, ఎస్వీ బ‌ధిర పాఠ‌శాల‌, ఎస్వీ సంగీత‌, నృత్య పాఠ‌శాల‌, ఎస్వీ నాద‌స్వ‌రం పాఠ‌శాల‌, తాటితోపులోని శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామి ఉన్న‌త పాఠ‌శాల‌, తిరుమ‌ల‌లోని ఎస్వీ ఉన్న‌త పాఠ‌శాల‌కు ఐఎస్ఓ స‌ర్టిఫికెట్ల‌ను సోమ‌వారం ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి చాంబ‌ర్‌లో ఆయ‌న చేతుల మీదుగా క‌మిటీ స‌భ్యులు ఆయా పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపాధ్యాయుల‌కు అందించారు.

టిటిడి పాఠ‌శాల‌లో డాక్యుమెంట్ల నిర్వ‌హ‌ణ‌, ఉత్త‌మ మౌళిక స‌దుపాయాలు, విద్యార్థుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌, ఆహార పంపిణీ, ఆపరేటింగ్ విధానం(ఎస్ఓపి), ఉత్త‌మ విద్యా ప్ర‌మాణాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఐఎస్ఓ-9001 స‌ర్టిఫికెట్ల‌ను అందించారు.

టిటిడి పాఠ‌శాల‌ల్లో భౌతిక దూరం, శుభ్ర‌త, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌, కోవిడ్ – 19 నిబంధ‌న‌ల బాగా పాటించినందుకు గుడ్‌ హైజెనిక్ ప్రాక్టీస్ (జిహెచ్‌పి) స‌ర్టిఫికెట్ల‌ను అందించారు.

టిటిడి పాఠ‌శాల్లో చ‌క్క‌టి విద్యా ప్ర‌మాణాలు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ, రికార్డుల నిర్వ‌హ‌ణ చేస్తున్న టిటిడి ఉన్న‌త పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపాధ్యాయులు శ్రీ‌మ‌తి సంధ్య‌, శ్రీ చంద్ర‌య్య‌, శ్రీ సురేంద్ర‌బాబు, శ్రీ‌మ‌తి గీతాంజ‌లి, శ్రీ‌మతి ప‌ద్మావ‌తి, శ్రీ క్రిష్ణ‌మూర్తి, శ్రీ‌మ‌తి జ‌మునారాణి, శ్రీ ర‌మ‌ణ‌మూర్తి, శ్రీ క్రిష్ణ‌మూర్తిల‌ను ఈవో ఈ సంద‌ర్భంగా అభినందించారు.          

జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, టిటిడి విద్యా శాఖాధికారి శ్రీ గోవింద‌రాజ‌న్,  హెచ్‌వైఎం ఐఎస్ఓ స‌ర్టిఫికెష‌న్ ప్రైవేట్ లిమిటెడ్ యండి శ్రీ ఆల‌పాటి శివ‌య్య పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.