టిటిడి విజిలెన్సు అధికారులపై చర్య తీసుకోవాలి : సిఐటియు  అనే వార్త వాస్తవ దూరం

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.

టిటిడి విజిలెన్సు అధికారులపై చర్య తీసుకోవాలి : సిఐటియు  అనే వార్త వాస్తవ దూరం

వివరణ(తిరుపతి, సెప్టెంబరు 27, 2013)

సెప్టెంబరు 27వ తేదీన ”ప్రజాశక్తి” తెలుగు దినపత్రిక నందు ”టిటిడి విజిలెన్సు అధికారులపై చర్య తీసుకోవాలి : సిఐటియు” అనే శీర్షికతో ప్రచురితమైన వార్తా కథనం వాస్తవ దూరం. దీనికి సంబంధించిన వాస్తవ వివరాలను కింద తెలియజేస్తున్నాము.
తితిదే విజిలెన్స్‌ విభాగంలోని కొందరు సిబ్బంది అక్రమంగా శ్రీవారి సుప్రభాతం సేవా టికెట్లు విక్రయించారని ప్రచురించడం నిరాధారమైన ఆరోపణ మాత్రమే. ఈ విషయానికి సంబంధించి ప్రాథమిక విచారణలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. పై విషయమై ఎటువంటి సమాచారం ఉన్నా, తితిదే కార్యనిర్వహణాధికారి గారికి కానీ, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి గారికి కాని ఉత్తరము ద్వారా లేక నేరుగా తెలిపితే, విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని సివిఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ తెలియజేశారు.
కావున పైన తెల్పిన వాస్తవాల్ని మీ పత్రిక నందు వివరణగా ప్రచురించాల్సిందిగా కోరడమైనది.

ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.