ENHANCE MERIT AND PASS PERCENT IN TTD INSTITUTIONS- JEO (H&E) _ టిటిడి విద్యాసంస్థ‌ల్లో ఉత్తీర్ణ‌త శాతం పెంచాలి

Tirupati, 21 Feb. 22: Increase the merit and pass percentage in TTD Educational Institutions instructed, TTD JEO (H&E) Smt. Sada Bhargavi.

 

A review meeting with all the Principal of Colleges, HMs of Schools was held in the JEO Chambers in TTD Administrative Building in Tirupati on Monday.

 

She directed all the TTD Educational institution heads to inculcate spiritual awareness among all the students apart from imparting stress-free academic Knowledge.

 

She also directed them to serve nutritious food to the pupils. She asked them to prepare data pertaining to each and every student and also their subject wise performance reports. The faculty should concentrate more on the students scoring low marks to enhance the pass percentage.

 

JEO has also instructed the Principals and HMs to ensure that the entire syllabus be completed within the stipulated time.

 

All the educational institutions should hold regular meetings with the parents of the student and encourage a healthy environment. She also advised to enhance ethical values among pupils and ensure spiritual feel, Hindu traditions and customs in all the deeds they perform.

 

She also said all the institutions should involve the students in planting trees in their respective premises and also ordered for regular health check-ups to the students.

 

The JEO instructed to prepare each institution Power Point Presentation about their activities and directed to enhance the extra curricular activities among students by showing them exclusive talent videos.

 

Devasthanam Education Officer Sri C Govindarajan was also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడి విద్యాసంస్థ‌ల్లో ఉత్తీర్ణ‌త శాతం పెంచాలి –

– విద్యార్థుల‌లో ఆధ్యాత్మిక భావ‌న పెంచాలి- జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 21: టిటిడి విద్యాసంస్థ‌ల్లో ఉత్తీర్ణ‌త శాతం పెంచేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి అధికారుల‌ను ఆదేశించారు. టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నంలోని త‌మ‌ కార్యాల‌యంలో సోమ‌వారం డిఈవో, క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్ళు, పాఠ‌శాల‌ల ప్ర‌ధానోపాధ్యాయులతో జెఈవో స‌మీక్ష‌ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి విద్యాసంస్థ‌ల్లో విలువ‌ల‌తో కూడిన, ఒత్తిడి లేని విద్య‌ అందించాల‌న్నారు. విద్యార్థుల‌కు పోష‌క విలువ‌లు అధికంగా ఉండే ఆహారం అందించాల‌ని ఆదేశించారు. క‌ళాశాల‌లు, పాఠ‌శాల‌ల్లోని విద్యార్థుల డేటా సిద్ధంచేయాల‌న్నారు. ఇందులో సబ్జెక్టుల వారిగా విద్యార్ధినీ విద్యార్థుల ప్ర‌తిభ ఏవిధంగా ఉంద‌నే విషయం పొందుప‌ర‌చాల‌న్నారు. సబ్జెక్టుల్లో త‌క్కువ మార్కులు వ‌చ్చిన విద్యార్థులు ఈ స‌మ‌స్య‌ను ఎలా అధిగ‌మించాలో సంబంధిత ఉపాధ్యాయులు, అధ్యాప‌కులు చ‌ర్చించి విద్యార్థుల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాల‌న్నారు. త‌ద్వారా ఎక్కువ శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ప్ర‌తి విద్యాసంస్థ‌లోనిర్ణీత స‌మ‌యంలో సిల‌బ‌స్ పూర్తి చేసి రివిజ‌న్ చేయాల‌న్నారు.

విద్యార్థులు వారి త‌ల్లిదండ్రుల‌తో త‌ర‌చూ స‌మావేశాలు ఏర్పాటు చేసి వారికి మ‌రింత ప్రేర‌ణ క‌లిగించాల‌ని చెప్పారు. టిటిడి విద్యాసంస్థ‌ల్లోని విద్యార్థుల‌కు ఆధ్యాత్మిక భావ‌న‌, తిల‌క‌ధార‌ణ‌, సంప్ర‌దాయ వ‌స్త్ర‌ ధార‌ణ‌, ఉచ్ఛార‌ణ‌, ప్ర‌తి దానిలో భ‌గ‌వంతుని చూసేలా వారికి శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించారు. పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల్లో ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందించేందుకు మొక్క‌లు విరివిగా నాటాల‌న్నారు. విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య ప‌రీక్ష‌లు త‌ప్ప‌నిస‌రిగా చేయాల‌ని ఆదేశించారు. ప్ర‌తి క‌ళాశాల‌లో ఆ సంస్థ యొక్క కార్య‌క‌లాపాల‌పై పిపిటి (ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్) త‌యారు చేసుకోవాల‌న్నారు. విద్యార్థుల్లో సృజ‌నాత్మ‌క‌తను వెలికి తీసే వీడియోలు చూపించాల‌న్నారు. స‌మావేశంలో డిఈవో శ్రీ గోవింద‌రాజ‌న్ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.