టిటిడి స్థానిక ఆల‌యాల‌లో ద‌ర్శ‌నం

టిటిడి స్థానిక ఆల‌యాల‌లో ద‌ర్శ‌నం

తిరుప‌తి, 2020 జూన్ 06: టిటిడి స్థానిక ఆల‌యాలైన తిరుచానూరులోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, శ్రీ‌నివాస‌మంగాపురం శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, అప్ప‌లాయ‌గుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల‌లో భ‌క్తుల‌కు ఆన్‌లైన్‌, ఎస్.ఎమ్.ఎస్‌, ఆయా ఆల‌యాల‌ ప్రాంగ‌ణంలో నిర్థేశిత పిఒఎస్ మిష‌న్‌ల ద్వారా జూన్ 8నుండి 30వ తేదీ వ‌ర‌కు ద‌ర్శ‌నం టోకెన్లు అందుబాటులో ఉంటాయి.

ఆన్‌లైన్‌లో టిటిడి వెబ్‌సైట్‌ https:/tirupatibalaji.ap.gov.in ద్వారా టిటిడి స్థానిక ఆల‌యాల‌లో ద‌ర్శ‌నం టోకెన్లు పొందేందుకు లో పొంద‌వ‌చ్చు.

అదేవిధంగా ఫోన్ నెం.7738286666కు ఎస్‌.ఎమ్‌.ఎస్ ద్వారా పొంద‌వ‌చ్చు. ఇందు కొర‌కు TTD(space)Temple Name(Space)Date(space)Number of persons టైపుచేసి ఎస్‌.ఎమ్‌.ఎస్ చేయాలి.

ఉదాహ‌ర‌ణ‌కు – టిటిడి అనుబంధ ఆల‌యాల‌లో 11వ తేదీ 6 మంది భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకునేందుకు ఎస్‌.ఎమ్‌.ఎస్ పంపు విధానం.

Ex- 1. TTD SVG 11.06.2020 6 (శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆల‌యం – తిరుప‌తి)

2.TTD SVP 11.06.2020 6    (శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం – తిరుచానూరు)

3.TTD SVS 11.06.2020 6  (శ్రీకల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి  ఆల‌యం – శ్రీ‌నివాస‌మంగాపురం)

4.TTD SVk 11.06.2020 6 ( శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామి ఆల‌యం – తిరుప‌తి)
 
5.TTD SVA 11.06.2020 6 ( ( ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యం- అప్ప‌లాయ‌గుంట‌)

ఆల‌యాల ద‌ర్శ‌నం వివ‌రాలు –

శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం – తిరుచానూరు

– ఉద‌యం 7.30 నుండి సాయంత్రం 6.00 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నం ఉంటుంది.   

– శుక్ర‌వారం ఉద‌యం 9.00 నుండి సాయంత్రం 6.00 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నం.

– ప్ర‌తి రోజు ఉద‌యం 11.00 నుండి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు వ‌ర‌కు అమ్మ‌వారి నైవేద్య విరామం.

శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం – తిరుప‌తి

– ఉద‌యం 7.30 నుండి సాయంత్రం 6.00 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నం ఉంటుంది.

– ఉద‌యం 10.00 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు స్వామివారి కైంక‌ర్యాల విరామం.

శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం – అప్ప‌లాయ‌గుంట‌

– జూన్ 8 నుండి 10వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 11.00 నుండి సాయంత్రం 5.00 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నం ఉంటుంది.

 – జూన్ 11వ తేదీ నుండి ఉద‌యం 7.30 నుండి సాయంత్రం 5.00 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నం ఉంటుంది.

ఉద‌యం 10.00 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు స్వామివారి నైవేద్య విరామం.

– శుక్ర‌వారం ఉద‌యం 10.00 నుండి సాయంత్రం 5.00 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నం.

శ్రీ క‌పిలేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం – తిరుప‌తి

– ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుండి సాయంత్రం 5.30 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నం ఉంటుంది. ఉద‌యం 11.00 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు స్వామివారి కైంక‌ర్యాల విరామం.

శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం – శ్రీ‌నివాస‌మంగాపురం

– ప్ర‌తి రోజు ఉద‌యం 7.30 నుండి సాయంత్రం 6.00 గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నం ఉంటుంది. ఉద‌యం 10.00 నుండి 11.00 గంట‌ల వ‌ర‌కు స్వామివారి కైంక‌ర్యాల విరామం.

– శుక్ర‌వారం ఉద‌యం 9.30 నుండి సాయంత్రం 6.00 గంట‌ల వ‌ర‌కు,  శ‌నివారం ఉద‌యం 8.30 నుండి 6.00 గంట‌ల వ‌ర‌కు స్వామివారి ద‌ర్శ‌నం.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది