టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

తిరుమల, 2023 ఆగస్టు 22: తిరుమల శ్రీవారికి మంగళవారం క్వాంటం ఎనర్జీ లిమిటెడ్ సంస్థ ఎండి శ్రీ సి.చక్రవర్తి విద్యుత్ ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించారు. ఈ వాహనం ధర రూ.1,18,276/- అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనం తాళాలను తిరుమల డిఐ శ్రీ  జానకీరామ్ రెడ్డికి అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ బోర్డు సభ్యులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.