టీటీడీకి రూ.2.5 లక్షల విలువైన నానో ఫెర్టిలైజర్స్‌ విరాళం 

టీటీడీకి రూ.2.5 లక్షల విలువైన నానో ఫెర్టిలైజర్స్‌ విరాళం

తిరుమల, 2023 జూలై 13: హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఫెర్టిలైజర్స్‌ తయారీ సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌వారు తమ నూతన ఉత్ప‌త్తులైన నానో ఫెర్టిలైజర్స్‌ శ్రీవారికి విరాళంగా అందించారు.

తిరుమల పాపావినాశనం రోడ్డులో గల టీటీడీ గార్డెన్‌ కార్యాలయం వద్ద గురువారం ఉదయం కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జి.వి.సుబ్బా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ శంక‌ర్ సుబ్ర‌మ‌ణ్యం రూ.2.5 లక్షలు విలువైన నానో డిఏపి, ఆక్యూమిస్ట్ కాల్షియమ్, గార్డిన వంటి నానో ఫెర్టిలైజర్స్‌ టీటీడీ గార్డెన్‌ డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ శ్రీనివాసులుకు అందచేశారు.

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌వారు త‌మ క్రొత్త ఉత్ప‌త్తుల‌ను మొద‌ట శ్రీ‌వారికి స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది.

ఈ కార్యక్రమంలో కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్లు శ్రీ సత్యనారాయణ, శ్రీ మాదబ్ అధికారి, శ్రీ హరీష్ మాత, మార్కెటింగ్ అఫీసర్‌ శ్రీ మురళి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది