AYURVEDIC EXPERT LAUDS TTD EFFORTS IN PROMOTING THE ANCIENT SCIENCE _ టీటీడీ ఆయుర్వేద పరిశోధనలు భేష్ – కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీకాంత్

* CENTRAL AYURVEDA RESEARCH INSTITUTE DIRECTOR DR N SRIKANTH

 

Tirupati,01 August 2022: The Central Ayurveda Research Institute Director Dr N Srikanth on Monday lauded the Research and Development activity by TTD in promoting Ayurvedic sciences.

 

He visited the Ayurveda Pharmacy, Ayurveda College and hospital run by the TTD and interacted with the students and faculty members.

 

Speaking on the occasion he said there are 31 Ayurveda institutions across the country conducting major research for new formulations and said the Union Government would whole-heartedly support the R&D efforts by the SV Ayurveda college.

 

JEO Sri Veerabrahmam, Principal of SV Ayurveda College Dr Murali Krishna, Vice-Principal Dr Sundaram and Dr Sri Durga were also present. 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ ఆయుర్వేద పరిశోధనలు భేష్

– కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీకాంత్

తిరుపతి 1 ఆగస్టు 2022: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ ఆయుర్వేద ఫార్మశీ, ఆయుర్వేద కళాశాలలో పరిశోధనలు బాగున్నాయని భారత ఆయుర్వేద పరిశోధన, ఆయుర్వేద వైద్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. శ్రీకాంత్ అభినందించారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆయుర్వేద ఫార్మశీ, కళాశాల, ఆసుపత్రిని సోమవారం ఆయన సందర్శించారు. అనంతరం ఆయన కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ మాట్లాడుతూ, దేశంలోని 31 ఆయుర్వేద పరిశోధనా కేంద్రాల ద్వారా జరిగిన పరిశోధన విషయాలను విపులంగా చెప్పారు. కొత్త మందుల తయారీ కోసం జరుగుతున్న పరిశోధనల ఫలితాలను వివరించారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో జరిగే పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరం, డాక్టర్ శ్రీ దుర్గ పాల్గొన్నారు.

అనంతరం డాక్టర్ శ్రీకాంత్ టీటీడీ జెఈవో శ్రీ వీర బ్రహ్మం ను కలిశారు. టీటీడీ ఆయుర్వేద కళాశాలలో జరుగుతున్న పరిశోధనల గురించి చర్చించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది