GREENERY SHOULD BE DEVELOPED AT TTD TEMPLES: JEO _ టీటీడీ ఆలయాల వద్ద పచ్చదనాన్ని పెంపొందించాలి : జేఈవో శ్రీ వీరబ్రహ్మం

Tirupati, 12 February 2024: TTD JEO Sri Veerabraham directed the officials to enhance the greenery at all its temples to provide more pleasant and spiritual atmosphere to the visiting devotees. 

He held a virtual meeting with the officials at his office in the TTD administration building on Monday.

On this occasion, the JEO said that appropriate steps should be taken to enhance greenery at Alipiri along with other TTD temples. 

The TTD should coordinate with the municipal authorities to take up planting of greenery in vacant plots.  He said medicinal plants should be grown in place of acacia trees in remnant forests. 

Officials were directed to make 2025 TTD calendars more attractive with pictures of local temples.  The officials were directed to complete the various ongoing engineering works in TTD as soon as possible.

Deputy EO Sri Govindarajan, DFO Sri Srinivas, Transport Department GM Sri Sesha Reddy, DEO Sri Bhaskar Reddy and other officials were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ ఆలయాల వద్ద పచ్చదనాన్ని పెంపొందించాలి : జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి, 2024 ఫిబ్రవరి 12: భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు టీటీడీ ఆలయాల వద్ద పచ్చదనాన్ని పెంపొందించాలని జేఈవో శ్రీ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలన భవనంలోని తన కార్యాలయంలో అధికారులతో సోమవారం ఆయన వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, టీటీడీ ఆలయాలతో పాటు అలిపిరి వద్ద పచ్చదనాన్ని పెంపొందించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. టీటీడీ ఖాళీ స్థలాల్లో మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుని మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. శేషాచల అడవుల్లో అకేషియా చెట్ల స్థానంలో ఔషధ మొక్కలు పెంచాలని చెప్పారు. 2025 టీటీడీ క్యాలెండర్లను స్థానిక ఆలయాల చిత్రాలతో మరింత ఆకర్షణీయంగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. టీటీడీలో జరుగుతున్న వివిధ ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్‌, డిఎఫ్వో శ్రీ శ్రీనివాస్, రవాణా విభాగం జియం శ్రీ శేషారెడ్డి, డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.