EO TAKES A VIEW OF TTD PROPERTIES IN RISHIKESH _ టీటీడీ ఆస్తులను పరిశీలించిన ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి
TIRUPATI, 11 SEPTEMBER 2021: TTD EO Dr KS Jawahar Reddy inspected the properties belonging to TTD at Rishikesh on Saturday.
Earlier, EO had visited Sri Venkateswara Swamy and Sri Chandra Mouleswara Swamy temples at Andhra Ashramam.
Later he visited TTD properties in Big Garden and Chungi Garden and learnt about their protection measures from officers concerned.
Estates Wing Special Officer Sri Mallikarjuna, EE Sri Narasimhamurty were also present.
Later the EO visited Visakha Seer Sri Swarupananda Saraswati Swamiji who is in his Chaturmasa Vrata Deeksha and took his blessings.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
టీటీడీ ఆస్తులను పరిశీలించిన ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి
తిరుపతి 11 సెప్టెంబరు 2021: రిషికేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తులను ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శనివారం పరిశీలించారు. తొలుత ఆంధ్రా ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వార్ల దర్శనం చేసుకున్నారు. అనంతరం అక్కడి భవనాలను పరిశీలించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. బిగ్ గార్డెన్, చుంగి గార్డెన్ లోని టీటీడీ ఆసులను పరిశీలించి, వాటి పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఈవో అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్టేట్ విభాగం ప్రత్యేక అధికారి శ్రీ మల్లిఖార్జున, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి తో పాటు స్థానిక అధికారులు ఉన్నారు.
అనంతరం ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి రుషికేష్ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి వారిని కలిశారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది