ACHIEVE NAAC A+ GRADE RECOGNITION FOR ALL TTD COLLEGES – TTD JEO SMT SADA BHARGAVI _ టీటీడీ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్, ఎన్‌బిఏ గుర్తింపునకు కృషి చేయాలి – జెఈవో శ్రీమతి సదా భార్గవి
Tirupati, 18 August 2022: TTD JEO (E&H) Smt Sada Bhargavi directed officials to complete the necessary works on war footing to achieve NAAC A+ grade recognition for the Sri Govindarajaswamy Arts college and NBA for Sri Padmavati Mahila Polytechnic college.
The JEO on Thursday evening accompanied by officials inspected the development works at the SGS Arts college and SPW Polytechnic college.
Speaking at a review meeting the TTD JEO said the NAAC and NBA committees are visiting the TTD institutions during September and hence all development works be completed by Engineering officials by August 31.
During the inspection she gave valuable suggestions on IT classrooms, labs modernisation, cleaning and greenery etc.
She asked officials to be ready with a PPP on facilities, quality educational systems, teaching methods at the institutions and urged college staff and students to strive and achieve NAAC A+ grade and NBA recognition.
Earlier she directed officials to get rid of the concrete waste lying around SGS college corridors.
DEO Sri Govindarajan, DE(Electrical) Smt Saraswati, EE Sri Manohar, SGS College Principal Sri Venugopal Reddy, Polytechnic College Principal Smt Asunta and officials were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్, ఎన్‌బిఏ గుర్తింపునకు కృషి చేయాలి – జెఈవో శ్రీమతి సదా భార్గవి
తిరుపతి 2022 ఆగస్టు 18: శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలకు నాక్ ఏ గ్రేడ్, శ్రీ పద్మావతి మహిళ పాలిటెక్నిక్ కళాశాలలకు ఎన్‌బిఏ గుర్తింపునకు అవసరమైన పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఎస్‌జిఎస్ ఆర్ట్స్ కళాశాల, ఎస్‌పిడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను జెఈవో గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జెఈవో మాట్లాడుతూ, కమిటీలు సెప్టెంబర్‌లో కళాశాలలను సందర్శించనున్న నేపథ్యంలో ఆగస్టు 31వ తేదీకి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కళాశాలలో మౌళిక వసతులను మరింతగా మెరుగుపరచాలన్నారు. ఐటి తరగతి గదులు, ల్యాబ్‌ల ఆధునీకరణ, పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందించడం తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
కళాశాలలోని వసతులు, విద్యార్థులకు అందిస్తున్న నాణ్యమైన విద్యా ప్రమాణాలు, కళాశాలలో అమలు చేస్తున్న పాలన, బోధన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేయాలన్నారు.
అంతకుముందు జె ఈవో శ్రీమతి సదా భార్గవి ఎస్‌జిఎస్ కళాశాల పరిసరాలను పరిశీలించి కాంక్రీట్ వ్యర్థాలు తొలగించాలని అధికారులను ఆదేశించారు . ఎస్‌పిడబ్ల్యూ పాలిటెక్నిక్ కళాశాలలో రికార్డులనుపరిశీలించి, పలు సూచనలు చేశారు.
డిఈవో శ్రీ గోవిందరాజన్, డిఇ(ఎలక్ట్రికల్) శ్రీమతి సరస్వతి, ఇఇ మనోహర్, ఎస్‌జిఎస్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి అసుంత, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.