SPOT COUNSELLING ON JULY 3-4 FOR ADMISSIONS IN TTD JUNIOR COLLEGES _ టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు జూలై 3, 4వ తేదీల్లో స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్

Tirupati, 01 July 2023: TTD has announced spot counselling on July 3-4 for admissions for the 2023-24 academic year in Sri Padmavati Mahila junior college and Sri Venkateswara junior college for inter.

 

Spot counselling will be held for vacant seats to those who had already applied online on the same dates.

 

During the counselling preference is given to children of TTD employees, children from SV Bala mandir, Tirupati local students, and those who could not get selected due to several reasons in the last three instalments and finally non-locals.

 

Counselling on July 3 in the morning will be held for the students with 540 (90% ) in Xth standard,and in the afternoon for those with 539 to 500 marks.

 

On July 4th morning to afternoon, students with 499-450 marks and in the afternoon for those with 449-360 marks will be considered.

 

TTD also appealed to students to procure information on seats availability ahead of appearing for counselling and that those coming for spot admissions would not get hostel facilities.

 

Besides the students of English medium in 10th standard could get admission in the same English medium and would not be accommodated in the Telugu medium courses, TTD clarified.

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు జూలై 3, 4వ తేదీల్లో స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్

తిరుపతి, 2023, జూలై 01: టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి జూన్ 12వ తేదీ నుండి మూడు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటర్ మీడియేట్ లో ప్రవేశాలు కల్పించారు.

ఈ కౌన్సెలింగ్ లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఇదివరకే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారికి జూలై 3, 4వ తేదీల్లో స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మొదట టీటీడీ ఉద్యోగుల పిల్లలకు, ఎస్వీ బాలమందిరం పిల్లలకు, ఇదివరకు మూడు విడతల్లో సీటు వచ్చి వివిధ కారణాలతో అడ్మిషన్ పొందలేని వారికి, తిరుపతి స్థానిక విద్యార్థులకు, స్థానికేతరులకు ఈ ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

జూలై 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పదో తరగతి లో 540(90%), ఆపై మార్కులు పైన వచ్చిన వారికి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 539 నుండి 500 మార్కులు వచ్చిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

జూలై 4న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 499 నుంచి 450 మార్కులు వచ్చిన వారికి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 449 నుంచి 360 మార్కుల వరకు వచ్చిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

కౌన్సెలింగ్ కు హాజరయ్యే వారు అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ముందుగా తెలుసుకోవాలని కోరడమైనది.

స్పాట్ అడ్మిషన్ లో ప్రవేశాలకు హాస్టల్ వసతి ఉండదు. పదో తరగతి ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులకు అదే మీడియంలో మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. వారికి తెలుగు మీడియం గ్రూపులు కేటాయించడం జరుగదు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.