టీటీడీ పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసు కేసు

టీటీడీ పై తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసు కేసు

తిరుపతి 30 మార్చి 2021: తిరుమల శ్రీవారికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన తలనీలాలను టీటీడీ చైనాకు స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేసిందని ఫేస్ బుక్, మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై మంగళవారం రాత్రి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీకి చెందిన ” రామ రాజ్యం మళ్లీ.మొదలైంది ” తెలుగుదేశం పార్టీ పొలిటికల్ వింగ్ , గంగా ప్రకాష్, ప్రియాంక రెడ్డి స్వచ్ఛ, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

వీరంతా ఫేస్ బుక్ లో పోస్టు లు పెట్టడం, షేర్ చేయడం, దుష్ప్రచారం చేయడం లాంటి చర్యలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు ఆధారాలు సమర్పించారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది