VAISHNO DEVI BOARD ON A STUDY TOUR _ టీటీడీ పై శ్రీ వైష్ణోదేవి ఆలయ అధికారుల క్షేత్ర స్థాయి అధ్యయనం

TIRUPATI, 09 MAY 2022: Shri Mata Vaishnavo Devi Shrine Board (SMVDSB) from Khatra, Jammu and Kashmir team which is on a two-day study tour visited Tirupati on Monday.

 

The team comprising of Joint EO Dr Sunil Sharma, other temple officials including Sri Viswajit Singh, Sri Dineesh Gupta, Sri Shammi Sharma were briefed on various development activities of TTD at SVETA.

 

Smt Prasanti, Director SVETA explained on temple management and other activities while Chief Audit Officer Sri Sesha Sailendra explained on Out Sourcing Staff deployment mechanism.

 

In the afternoon, the team visited SV Gosala, Govinda Raja Swamy temple, Panchagavya Manufacturing Unit, IT, SVBC etc.

 

On Tuesday, the team visits all departments in Tirumala after darshan of Srivaru.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD TIRUPATI

టీటీడీ పై శ్రీ వైష్ణోదేవి ఆలయ అధికారుల క్షేత్ర స్థాయి అధ్యయనం

తిరుపతి 9 మే 2022: జమ్మూ లోని శ్రీ మాత వైష్ణోదేవి ఆలయం అధికారులు టీటీడీ వ్యవస్థ, పాలన, ఆలయాల నిర్వహణపై అధ్యయనం చేయడానికి సోమవారం ప్రత్యేక బృందం వచ్చింది. ఈ బృందానికి శ్వేత శిక్షణా సంస్ధ రెండు రోజుల స్టడీ విజిట్ ఏర్పాటుచేసింది. వీరికి పరిపాలన, ఆలయాల నిర్వహణ గురించి శ్వేత డైరక్టర్ శ్రీమతి ఎ.ప్రశాంతి వివరించారు. టిటిడి ఛీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేష శైలేంద్ర ఔట్ సోర్సింగ్ స్టాఫ్ విధానాలపై అవగాహన కల్పించారు.

ఆ తర్వాత ఈ బృందం టిటిడి గోశాల, పంచగవ్య తయారీ యూనిట్ , ఎస్.వి భక్తి ఛానల్, టిటిడి ఇన్ఫర్మేషన్ టెక్నాలజి విభాగం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం సందర్శించి అనేక విషయాలు పరిశీలించింది, మంగళవారం తిరుమలలో అనేక విభాగాలు సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణోదేవి ఆలయ సంయుక్త ఛీఫ్ కార్యనిర్వహణాధికారి డాక్టర్ సునీల్ శర్మ, ఆలయ అధికారులు శ్రీ విష్వజిత్ సింగ్, శ్రీ దినిష్ గుప్త, శ్రీ షమి శర్మ పాల్గొన్నారు, ఈ బృందాన్ని శ్రీ బాలాజి దీక్షితులు సమన్వయం చేశారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది