TTD STUDENTS SHOULD SHINE IN COMPETITIVE EXAMS -JEO (H&E) _ టీటీడీ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలి-⁠ ⁠జెఈవో శ్రీమతి సదా భార్గవి

Tirupati, 07 February 2024: TTD JEO for (Health and Education) Smt Sada Bhargavi called upon Students of all TTD educational institutions to excel and shine in competitive examinations.

Addressing the 31st  anniversary celebrations of the Sri Padmavati Junior College chaired by Principal Dr C Bhuvaneswari the JEO  said TTD is mulling to launch coaching facilities for NEET, EAMCET, LAWCET, CA etc.

She also complimented students, DEO principal, faculty who brought good results and laurels to 

TTD.

Earlier she inaugurated the night halt building set up by TTD for parents of students within college premises and exhorted them to achieve 100% results this year.

Chief Guest DLO Sri Y Veeraju, Honorary guest  DEO Sri Bhaskar Reddy and TTD law officer Sri Yugandhar Reddy spoke.

Earlier college principal presented an annual report.

SPWDC retired Telugu HoD Dr DM Premavathi, Hostel Warden Dr Meena Kumari and others were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలి

•⁠ ⁠జెఈవో శ్రీమతి సదా భార్గవి

•⁠ ⁠ఘనంగా శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 31వ వార్షికోత్సవం

తిరుప‌తి, 2024, ఫిబ్ర‌వ‌రి 07: టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలని జెఈవో శ్రీమతి సదా భార్గవి కోరారు. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల 31వ వార్షికోత్సవం ప్రిన్సిపాల్ డా. సి.భువనేశ్వరి అధ్యక్షతన బుధవారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో శ్రీమతి సదా భార్గవి ముందుగా విద్యార్థినుల తల్లిదండ్రుల సౌకర్యార్థం నిర్మించిన ధాత్రి సదన్ ను ప్రారంభించారు. అనంతరం జెఈవో మాట్లాడుతూ నీట్, ఎంసెట్, లాసెట్, సిఎ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు కోచింగ్ వసతి కల్పిస్తామన్నారు. గత సంవత్సరం వచ్చిన ఫలితాలను అభినందించారు. ఈ ఫలితాల సాధనకు కారకులైన డీఈవోకు, ప్రిన్సిపాల్ కు అధ్యాపకులకు, విద్యార్థినులకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ సంవత్సరం 100 శాతం ఫలితాలు సాధించాలని కోరారు. భక్తుల కానుకల ద్వారా టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో, ఏకాగ్రతతో విద్యాబుద్ధులు నేర్చుకోవాలన్నారు. కళాశాలలో నిర్వహించే మెంటార్ షిప్, ప్రేరణ లాంటి కార్యక్రమాలను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. విద్యార్థినులకు నెలకోసారి తిరుమల స్వామివారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. విద్యార్థినులు చదువుతోపాటు తమకు నచ్చిన రంగంలో రాణించేందుకు సాధన చేయాలన్నారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన టీటీడీ న్యాయాధికారి శ్రీ వై.వీర్రాజు మాట్లాడుతూ ఆహ్లాదకర వాతావరణంలో టీటీడీ విద్యను అందిస్తోందని, చక్కగా వినియోగించుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ విద్యార్థినులది సందిగ్ధ వయసు కావున అనేక ప్రభావాలు ఉంటాయని, అధ్యాపకులు, తల్లిదండ్రుల సలహాలను తప్పక పాటించాలని సూచించారు. కళాశాలలో చేరిన మొదటి రోజే దృఢమైన ఆశయం ఏర్పరచుకోవాలని, తల్లిదండ్రులు మీ గురించి గర్వంగా చెప్పుకునేలా ఎదగాలని కోరారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన టీటీడీ డీఈవో డా. ఎం.భాస్కర్ రెడ్డి ప్రసంగిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న 33 విద్యాసంస్థలు ఏ ప్లస్ గ్రేడ్ తో దూసుకుపోతున్నాయని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను మానసికంగా దృఢంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం టీటీడీ విద్యాసంస్థల ప్రత్యేకత అన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఎదుగుదలకు దోహదపడిన డా. రాజేశ్వరిమూర్తి, డా. ప్రేమావతి సేవలను కొనియాడారు.

టీటీడీ సహాయ న్యాయాధికారి శ్రీ యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ టీటీడీ విద్యాసంస్థల్లో చదవడం పూర్వజన్మ సుకృతమని తెలియజేశారు.

ముందుగా ప్రిన్సిపాల్ కళాశాలలో విద్యార్థినుల సర్వతోముఖాభివృద్ధికి చేపట్టిన చర్యలను, వార్షిక నివేదికను వినిపించారు.

ఈ కార్యక్రమంలో విశ్రాంత తెలుగు అధ్యాపకులు డాక్టర్ ప్రేమావతి, డా.మీనా కుమారి, హాస్టల్ వార్డెన్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, ఎన్ సి సి, ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.