ENSURE 100% PASS IN TTD EDUCATIONAL INSTITUTIONS-  JEO  _ టీటీడీ విద్యాసంస్థల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి – జేఈవో  శ్రీ వీరబ్రహ్మం

Tirupati, 13 February 2024: TTD JEO Sri Veerabraham directed that the principals and headmasters should make a concrete action plan to achieve 100 percent pass in TTD junior colleges and schools this academic year. 

On Tuesday, he conducted a review meeting with the educational institutions in his chambers in the TTD administrative building.

Speaking on this occasion, Sri. Veerabraham suggested that special training classes should be organized for students who are lagging behind in education.  He also asked the institution heads to inform the students about the educational opportunities available on passing the tenth standard. He said the role of principals is crucial for the all-round development of students, and asked them to be proactive in discharging their duties and responsibilities to reach the goal.

TTD DEO Dr.M. Bhaskar Reddy  Principals of the junior colleges were also present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

టీటీడీ విద్యాసంస్థల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి – జేఈవో  శ్రీ వీరబ్రహ్మం
 
తిరుప‌తి, 2024 ఫిబ్ర‌వ‌రి 13: టీటీడీ జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో ఈ విద్యా సంవ‌త్స‌రంలో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రిన్సిపాళ్లు, ప్ర‌ధానోపాధ్యాయులు కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని జేఈవో  శ్రీ వీరబ్రహ్మం ఆదేశించారు.  టీటీడీ పరిపాలన భవనంలో విద్యాసంస్థ‌ల‌పై మంగళవారం ఆయన  సమీక్ష నిర్వహించారు. 
 
 ఈ సందర్భంగా శ్రీ  వీరబ్రహ్మం మాట్లాడుతూ చదువులో వెనుక‌బ‌డిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించ‌డం ద్వారా ల‌భించే విద్యావ‌కాశాల గురించి విద్యార్థుల‌కు తెలియ‌జేయాల‌న్నారు. విద్యార్థుల స‌ర్వ‌తోముఖాభివృద్ధికి ప్రధానోపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. డీఈవో డాక్టర్  భాస్కర్ రెడ్డి కి చాలా అనుభ‌వం ఉంద‌ని, ఆయన  సూచ‌న‌ల‌తో విద్యాసంస్థ‌ల‌ను అభివృద్ధికి పని  చేయాల‌ని కోరారు. అదేవిధంగా జూనియర్ కళాశాలల‌ ప్రిన్సిపాళ్ల‌తో కూడా జేఈవో  ప్రత్యేకంగా  సమీక్ష నిర్వహించారు.
 
టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.