SPECIAL PROGRAMS ON THE OCCASION OF DHANURMASAM IN TTD LOCAL TEMPLES _ టీటీడీ స్థానికాల‌యాల్లో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

Tirupati, 13 December 2023: Special programs will be conducted from December 17 to January 14 on the occasion of Dhanurmasam in all the Sri Vaishnava local temples of TTD.  The sacred Dhanurmasam starts on December 17 at 12.34 AM.

In Srinivasamangapuram Sri Kalyana Venkateswara Swamy temple daily  Tiruppavai parayanam will be recited in the place of Suprabhatam and Dhanurmasa darshan will be offered to the devotees. 

Due to this reason, Suprabhatham Seva Tickets will not be issued.  Devotees are requested to note this.

In Tiruchanur Sri Padmavati Ammavari Temple devotees are provided with Dhanurmasa darshanam from December 17 to January 14.  On the first day, on the evening of December 17, the Sahasradl Deepalankara seva remains cancelled.

Dhanurmasa darshan is offered to the devotees in the temple for a month between 4.30 am to 6 am.

Similarly, Tiruppavai Parayanam and Dhanurmasa darshan are offered to the devotees in place of Suprabhatam from 4 am to 5.30 am at Sri Govindaraja Swamy temple in Tirupati.

Dhanurmasa kainkaryas will be held at Sri Kodandarama Swamy temple in Tirupati from 4 am to 5 am and Dhanurmasa darshan will be offered to devotees between 5.30 am and 8 am.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టీటీడీ స్థానికాల‌యాల్లో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు

తిరుపతి, 2023 డిసెంబరు 13: టీటీడీ స్థానికాల‌యాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ‌హించ‌నున్నారు. డిసెంబరు 16వ తేదీ రాత్రి 12.34 గంట‌ల‌కు ధనుర్మాసం ప్రారంభమవుతుంది.

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 17 నుండి జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిరోజూ ఉదయం 4 నుండి 6 గంటల వరకు సుప్ర‌భాతం స్థానంలో ఏకాంతంగా తిరుప్పావై పారాయ‌ణం, భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఈ కార‌ణంగా సుప్ర‌భాతం సేవా టికెట్లు జారీ చేయ‌రు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో…

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17 నుండి జనవరి 14వ తేదీ వరకు భ‌క్తుల‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. మొద‌టిరోజైన డిసెంబ‌రు 17న సాయంత్రం ధ‌నుర్మాసం గంట కార‌ణంగా స‌హ‌స్ర‌దీపాలంకార సేవ ర‌ద్ద‌యింది. ఆల‌యంలో నెల రోజుల పాటు ఉద‌యం 4.30 నుండి 6 గంట‌ల వ‌ర‌కు ధ‌నుర్మాసం గంట‌, ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

అదేవిధంగా, తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు సుప్ర‌భాతం స్థానంలో తిరుప్పావై పారాయ‌ణం, భ‌క్తుల‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామాల‌యంలో ఉద‌యం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు ధ‌నుర్మాస కైంక‌ర్యాలు, ఉద‌యం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.


టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.